నటుడిగా వెండితెరకు పరిచయం అయిన చిరంజీవి హీరోగా, సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా ఎదగటం వెనుక ఎంతో కృషి ఉంది. చరిత్రను తిరగరాసే ఎన్నో సూపర్‌ హిట్లు ఆయన కెరీర్‌లో ఉన్నాయి. కెరీర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఫ్లాప్‌లు వచ్చినా వరుసగా రెండు మూడేళ్ల పాటు ఫ్లాప్‌ వచ్చిన సందర్భాలు మాత్రం చాలా తక్కువే. అయితే అలాంటి ఓ టఫ్‌ ఫేజ్‌కు మెగాస్టార్‌ కెరీర్‌లో వచ్చింది. వరుసగా నాలుగేళ్ల పాటు మెగాస్టార్‌ కెరీర్‌ ఒక్క హిట్‌ కూడా రాలేదు. ఆ నాలుగేళ్లు చిరుకే కాదు ఆయన అభిమానులకు కూడా బ్లాక్‌ డేస్‌ లాంటివి.

 

గ్యాంగ్‌ లీడర్‌, ఘరానా మొగుడు లాంటి సినిమాలతో మెగాస్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ అందుకున్న చిరు, తరువాత ఆ స్థాయి సినిమాను ఇవ్వటంలో ఫెయిల్ అయ్యాడు. ఆ మాస్‌ ఆడియన్స్‌కు ఆరాధ్యదైవంగా మారిన చిరు ఒక్కసారిగా కొత్తగా కనిపించే సరికి ఆయడిన్స్‌ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఘరానా మొగుడు లాంటి మాస్ సినిమా తరువాత ఆపద్భాందవుడు లాంటి క్లాస్‌ ప్రయోగం చేశాడు చిరు. ఈ సినిమా మెగాస్టార్‌ను నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కించినా కమర్సియల్‌గా మాత్రం దారుణంగా నిరాశపరిచింది.

 

సినిమా తరువాడు నాలుగేళ్ల పాటు చిరు కెరీర్‌లో సూపర్‌ హిట్‌ అన్నదే లేదు. ముఠామేస్త్రీ లాంటి కమర్షియల్‌ సినిమా చేసినా అది కూడా జస్ట్ ఓకె అని మాత్రమే అనిపించుకుంది. లెజెండరీ యాక్టర్‌ నాగేశ్వరరావుతో కలిసి చేసిన మెకానిక్‌ అల్లుడు మరో డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తరువాత వరుసగా ముగ్గరు మొనగాళ్లు, ఎస్‌పీ పరుశురాం, అల్లుడా మాజాకా, బిగ్ బాస్‌ ఇలా వరుస డిజాస్టర్‌లు మెగాస్టార్‌ కెరీర్‌నే ప్రశ్నార్థకం చేశాయి. ఇలా దారుణమైన రిజల్ట్స్‌ వస్తుండటంతో చిరంజీవి 1996లో హీరోగా ఒక్క సినిమా కూడా చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: