అభిమానుల గుండెలో తనదైన ముద్ర వేసుకున్న హీరో. అతను నేటి తరం యువ హీరోలకు ఆదర్శం. ఏ పాత్రనైనా సవాల్ చేస్తూ చేయగల సమర్దుడు. అశేష అభిమానులకు ఆయన మెగాస్టార్. ఆయననే మన మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషి, స్వీయ ప్రతిభే ఆయన కెరీర్ కు పునాది రాళ్లు. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత. అతని డ్యాన్స్, ఫైట్స్ తో బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మగధీరుడు.

 

చిరంజీవి 1978లో ‘పునాదిరాళ్లు’ మూవీతో ఆర్టిస్ట్‌గా సెలక్ట్ అయ్యాడు. కానీ విడుదలైన ఫస్ట్ మూవీ ‘ప్రాణంఖరీదు’. తొలి సినిమాతోనే వెండితెర మీద చమక్కులా మెరిసాడు చిరంజీవి. ఇక చిరంజీవి హీరోగా స్టార్ డమ్ తెచ్చిన సినిమా ‘ఖైదీ’. ఈ సినిమా తర్వాత ఆచితూచి సినిమాలు చేసి టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యాడు. కేవల మాస్ చిత్రాలకే పరిమితం కాకుండా... మధ్యతరగతి జీవితాలకు సంబంధించి కథలలో నటించి నటుడిగా సెహభాష్ అనిపించుకున్నాడు. సెంటి మెంట్ టచ్ ఉన్న పాత్రలను ధరించి అందరి మన్ననలు పొందాడు. శుభలేఖ, మగమహారాజు, అభిలాష,రుద్రవీణ చిత్రాలు ఆర్టిస్ట్ గా చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చాయి.

 

చిరు కామెడీ టైమింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మానందం వంటి కమెడియన్లతో సైతం పోటీపడి చిరు పండించిన కామెడీ ఆడియన్స్ ను అలరించింది. హాస్య సన్నివేశాలు చేస్తున్నప్పడు చిరు తనను తాను చక్కగా మలుచుకనే తీరే అతన్ని మెగాస్టార్ గా నిలబెట్టింది. దాదాపు 41 ఏళ్ల కెరీర్‌లో 150 సినిమాలు చేసారు చిరంజీవి.

 

ఈ మధ్యలో రాజకీయాల్లో వెళ్లాడు. అక్కడ లక్ కలిసి రాలేదు. దీంతో అనకు అచ్చొచ్చిన సినిమాలనే నమ్ముకున్నాడు. తన రీ ఎంట్రీ మూవీగా ‘ఖైదీ నెం. 150’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన తనలో ఇది వరకటి చార్మింగ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు.సైరా నరసింహారెడ్డి’సినిమాతో మరో సారి అభిమానుల మనసు గెలుచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: