కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా.. స్వయం కృషితో ఎదిగి వచ్చారు చిరు. ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. చిరంజీవి సినీ కెరీర్‌లో ఒక్కో సినిమా చిరు కెరీర్ ను ఒక్కో మలుపు తిప్పింది. ఎంత మంది హీరోలు వచ్చినా వెళ్లినా మెగాస్టార్ అంటే టాలీవుడ్‌కి ఎవరెస్ట్ శిఖరం చిరంజీవి అనే చెప్పాలి. మెగా హీరోలకే కాదు.. మిగతా హీరోలకు మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్‌గానే ఉన్నారు. 

 

టాలీవుడ్‌లో ఈ గ్యాంగ్ లీడర్‌కి 60 ఏళ్లు దాటిని ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం దగ్గలేదని ఆయన రీఎంట్రీ సినిమాలే చెప్పేస్తున్నాయి. అయితే నంబర్ వన్ హీరోగా చిరంజీవి కెరీర్ ఉన్నతదశలో ఉండగా వచ్చిన సినిమా.. అంత వరకూ చిరంజీవితో సహా టాలీవుడ్ హీరోలు స్థాపించిన రికార్డులన్నింటినీ బ్రేక్ చేసిన సినిమా.. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఘరానామొగుడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని దేవి ఫిలిం ప్రొడక్షన్స్ కె. దేవీవరప్రసాద్ నిర్మించారు. 

 

ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న నగ్మా, వాణీ విశ్వనాధ్ హీరోయిన్లుగా న‌టించారు. ఘరానా మొగుడు సినిమా రిలీజైన తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. కన్నడ సూపర్‌స్టార్ రాజ్ కుమార్ నటించిన అనురాగ ఆరలితు అనే చిత్రానికి రీమేక్. 1992లో విడుదలైన ఈ చిత్రం 56 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసింది.  అంతేకాదు, 1993లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రంలో బంగారు కోడిపెట్ట, ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు వంటి పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. 

 

అలాగే ఈ చిత్రంలో 'కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో.. మాస్టారూ అంటూ పలికిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంత‌గానో రంజింప చేశాయి. ఇలాంటి ఏన్నో ఘనతలు పూర్తి చేసుకొన్న ఘరానా మొగుడు చిత్రం చిరంజీవి కెరీర్‌లో ఎన్నో విజయాలకు స్ఫూర్తిగా నిలిచింది. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన ఈ చిత్రానికి అప్ప‌ట్లోనే చిరంజీవి 1.25 కోట్ల‌ రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డంలో సంచలనం సృష్టించింది. ఈ నేప‌థ్యంలోనే 1.25 కోట్ల‌ భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకున్న తొలి తెలుగు హీరోగా రికార్ట్స్ కూడా క్రియేట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: