ప్రపంచాన్ని ఇప్పుడు గజ గజ వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఇప్పటికీ చైనాలో 2 వేల మంది బలి అయినట్లు తెలుస్తుంది.  అయితే అంతకు మించే ఉంటారని మరికొంత మంది అంటున్నారు.  ఇక వేల సంఖ్యలో కరోనా వైరస్ కి గురిఅయినట్లు... ఏ క్షణంలో మరణిస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నట్లు ఏర్పడిందని అంటున్నారు. అయితే నాలోని హుబీ ప్రావిన్స్‌లో కొత్త కరోనావైరస్ కేసులు వరుసగా రెండవ రోజు పడిపోయాయి, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన అనంతరం మరణాలు సంఖ్య పెరిగింది, అయితే కరోనావైరస్ అంటువ్యాధి మందగించిందో లేదో తెలుసుకోవడానికి ఇంకా తగినంత డేటా మాత్రం లేదు.

 

ఇప్పటికీ   1,693 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 1,807 నమోదైతే.. ఫిబ్రవరి 11 నుండి ఈ ప్రావిన్స్ లో అత్యల్ప సంఖ్యగా ఉంది. అయితే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానమైన వూహాన్ లోని వుచాంగ్ హాస్పిటల్ డైరెక్టర్ ల్యూ జిమింగ్  కూడా వైరస్ బారినపడి చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఈ నెల ప్రారంభంలో, కరోనావైరస్ గురించి ముందస్తు హెచ్చరిక జారీ చేసిన వైద్యుడు లి వెన్లియాంగ్ మరణానికి చైనాలో లక్షలాది మంది సంతాపం తెలిపారు.  డాక్టర్ల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అని అక్కడి ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు.

 

వైరస్ వ్యాప్తి భారీగా పెరిగిపోవడంతో చైనాలో మెడికల్ స్టాఫ్ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా మెడికల్ స్టాఫ్ కు కరోనా వైరస్ సోకుతోంది. వూహాన్ లోని ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారని.. మెడికల్ స్టాఫ్ కు సరిపడా మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్లు అందుబాటులో లేవని కొందరు హెల్త్ వర్కర్లు ఆరోపించారు.  ఏది ఏమైనా మనిషి చేస్తున్న ప్రయోగాల పరిణామాలే ఇలాంటి వైరస్ లు ప్రబలుతున్నాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: