వెండితెర మీద దేవుడి పాత్రలు చెయ్యాలి అంటే ఒక ధైర్యం ఉండాలి. హావ భావాల నుంచి నోటి మాట వరకు కూడా ప్రతీ ఒక్కటి ప్రత్యేకంగా ఉండాలి. ఆ పాత్రకు నటుడు కచ్చితంగా సరిపోతేనే ఒక అందం వస్తుంది. లేకపోతే సినిమా విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మన తెలుగు సినీ పరిశ్రమలో దేవుళ్ళ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్, సుమన్, అక్కినేని, చిరంజీవి ఇలా చాలా మంది హీరోలు దేవుడి పాత్రల్లో జీవించారు కూడా. ఆ పాత్రలు వాళ్ళు మినహా ఎవరూ చేయలేరు అనే విధంగా చేసారు. 

 

ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు పాత్రలు ఎలా అయితే అతికినట్టు సరిపోయే వారో, చిరంజీవి కూడా శివుడి పాత్రలకు అతికినట్టు సరిపోయేవారు. టాలీవుడ్ లో శివుడు అంటే ఇప్పటికి కూడా చిరంజీవే. శివుడి పాత్రకి చిరంజీవి అతికినట్టు సరిపోతారు. శివుడు శివుడు శివుడు, ఆపద్భాందవుడు, మంజునాథ చిత్రాలలో చిరంజీవిని శివుడుగా చూడొచ్చు. ముఖ్యంగా మంజునాధ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కర్ణాటక రాష్ట్రంలో  ధర్మశాలలోని శ్రీ మంజునాథేశ్వరుని మీద ఈ సినిమాను రూపొందించారు.

 

ఈ సినిమాలో చిరంజీవి శివునిగా, అర్జున్ శివభక్తుడు మంజునాధుడిగా నటించగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు కూడా అందుకు౦ది. ఇప్పటికి టాలీవుడ్ లో శివుడి పాత్రలు అంటే చిరంజీవి గురించే చెప్పుకుంటారు అభిమానులు. తనకు ఇచ్చిన ఏ పాత్ర అయినా సరే సమర్ధవంతంగా చేయగలిగే సామర్ధ్య౦ ఉన్న హీరో చిరంజీవి. అందుకే ఆయన చేసిన శివుడి పాత్రలకు అంత ఆదరణ వచ్చింది. పాత్రలో నటించడం కాదు. జీవించడం అని చెప్పి ఆయన చేసిన ప్రతీ పాత్ర కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటికి కొందరు అభిమానులు ఆయన శివుడి పాత్రలో చేసిన ఫోటోలను తమ దేవుడి గదిలో పెట్టుకున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: