టాలీవుడ్ లో చిరంజీవిని కొట్టిన నటుడు మరొకరు లేరు అనేది ఆయన అభిమానులతో పాటు కొందరు సినీ పరిశీలకులు కూడా చెప్పే మాట. ఇందుకోసమే చిరంజీవి అంతటి మెగాస్టార్ అయ్యారు. తనను ఇంతగా ఆదరించిన తన అభిమానులకు, తెలుగు ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపనతో ఆయన సరికొత్తగా ఆలోచించారు. ఒక్క సినిమాలే కాదు సేవా కార్యక్రమాలు కూడా చెయ్యాలని భావించారు. అందుకోసం పలు సేవా సంస్థలకు శ్రీకారం చుట్టారు. చిరంజీవి అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించారు.

 

'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా కార్యక్రమాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి ప్రభుత్వం చేత గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయంగా చెప్తూ ఉంటారు అభిమానులు. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో లక్షలాది మంది, నేత్రదానం వలన వేలాది మంది, సేవలు అందుకున్నారు. 

 

ఇప్పటికి ఈ సంస్థల కు లక్షలాది మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడాని కి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి. ఇలా రాజకీయాల్లో లేకుండానే సేవా కార్యక్రమాలు చేయవచ్చు అని చిరంజీవి నిరూపించారు. తన సేవా కార్యక్రమాల మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే చిరంజీవి మాత్రం ఎక్కడ వేనక్కు తగ్గలేదు అనేది వాస్తవం. రాజకీయ నాయకులు కూడా ఆయన సేవా కార్యక్రమాలను టార్గెట్ చేసి విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే సేవే మార్గం అంటూ చిరంజీవి వేసిన అడుగులు అన్నీ కూడా ఇప్పటికి ఎందరికో ఆదర్శం. ప్రధానంగా తాను నిర్వహించే బ్లడ్ బ్యాంకు మీద ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా సరే చిరంజీవి మాత్రం ఆగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: