ఇండియాలో మనకు సినిమా క్రేజ్ ఎక్కువ. అందుకే అభిమాన హీరోలను, హీరోయిన్లను అభిమానులు, ట్రేడ్, ఇండస్ట్రీ వారికున్న క్రేజ్ ను బట్టి పలు పేర్లతో పిలుచుకుంటారు. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి మెగాస్టార్ గా మారటానికి ఆయనకు వచ్చిన మాస్ ఇమేజ్ ఓ కారణం. ఆ మాస్ ఇమేజ్ చిరంజీవికి ‘మెగాస్టార్’ అనే బిరుదును తీసుకొచ్చింది. నిజానికి ఏ భాషలో టాప్ హీరో ఉన్నా.. సూపర్ మాస్ ఇమేజ్ ఉన్నా వారిని సూపర్ స్టార్ అనే బిరుదుతోనే పిలుస్తారు. తెలుగులో కృష్ణ, బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, తమిళ్ లో రజినీకాంత్ ను సూపర్ స్టార్ అనే అంటారు.

 

 

తెలుగులో చిరంజీవిని మాత్రమే ‘మెగాస్టార్’ గా పిలుస్తారు. తొలినాళ్లలో డైనమిక్ హీరో నుంచి సుప్రీం హీరోగా వెలిగిపోయిన చిరంజీవిని మెగాస్టార్ గా మార్చింది నిర్మాత కేఎస్ రామారావు. ఈ బిరుదును 1988లో తొలిసారిగా మరణమృదంగం సినిమాలో టైటిల్ కార్డ్స్ లో వేశారు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి చిరంజీవి పేరు మెగాస్టార్ అయిపోయింది. చిరంజీవి అంటే మెగాస్టార్.. మెగాస్టార్ అంటే చిరంజీవి అనేంతగా దేశం మొత్తం ఆయన పేరు మోగిపోయింది. చిరంజీవి కాల్షీట్స్ ఇవ్వడమే నిర్మాతలకు వరం. ఆయనతో సినిమా చేయడమే దర్శకుల చిరకాల కోరిక. అంతలా చిరంజీవి ప్రభ వెలిగిపోయింది.

 

 

మెగాస్టార్ గా ఆయన అందుకోని పేరు ప్రఖ్యాతులు, చేరుకోని శిఖరం లేదు. డైనమిక్ హీరోగా స్పీడ్ ఫైట్లు, డ్యాన్సులు చేస్తే, సుప్రీం హీరోగా బ్రేక్ డ్యాన్సులు వేసి చరిత్ర సృష్టించారు. ఇక మెగాస్టార్ గా రికార్డులు తిరగరాస్తూ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ.. తనకు తాను టాలీవుడ్ అనే ఎవరెస్ట్ శిఖరం మీద రాజులా కూర్చున్నాడు. ఇప్పటికీ ఆ మెగాస్టార్ టాలీవుడ్ రారాజే.

మరింత సమాచారం తెలుసుకోండి: