‘అల వైకుంఠపురం’ మూవీలో నిర్మాణ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ సూచనలకు అనుగుణంగా ఆమూవీ కథలో అనేక మార్పులు చేసాడని వార్తలు వచ్చాయి. అయితే ‘అల’ ఇండస్ట్రీ హిట్ గా మారడంతో  త్రివిక్రమ్ పడిన రాజీకి ఫలితం దక్కింది. 


ఇప్పుడు ఈ మూవీ సాధించిన అనూహ్య విజయంతో ఈ మూవీ పై బాలీవుడ్ దృష్టిపడి ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఈ మూవీ రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం సుమారు 8 కోట్ల ఆఫర్ బాలీవుడ్ నుంచి రావడంతో ఆ మూవీ రీమేక్ రైట్స్ ను ఇచ్చివేసి హాయిగా ఫలితం ఎంజాయ్ చేద్దామని త్రివిక్రమ్ భావించాడు.


అయితే ఈసూచన అల్లు అరవింద్ కు నచ్చకపోవడమే కాకుండా ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేద్దామని ఈ మూవీ నిర్మాతలు హారికా హాసినీ త్రివిక్రమ్ లపై విపరీతమైన ఒత్తిడి అరవింద్ చేయడంతో చివరకు త్రివిక్రమ్ రాజీపడి ఈ మూవీ రీమేక్ కు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా నుండి వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీని ‘కబీర్ సింగ్’ మూవీని హిందీలో నిర్మించిన నిర్మాతలు బాలీవుడ్ లో తీస్తూ ఈ మూవీ ప్రాజెక్ట్ లో అరవింద్ తో పాటు హారికా హాసినీ త్రివిక్రమ్ లకు కూడ వాటా ఇచ్చినట్లు టాక్. 


అయితే ‘అల వైకుంఠపురములో’ కథను మల్టీ స్టారర్ గా మార్చి తెలుగు వెర్షన్ కు మార్పులు చేస్తూ ఇద్దరి హీరోల సినిమాగా హిందీ ‘అల వైకుంఠపురములో’ మారుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ మార్పుల విషయమై త్రివిక్రమ్ బాలీవుడ్ నిర్మాతలతో చర్చలు జరుగుతున్నట్లు టాక్. రూపాయి పెట్టుబడి లేకుండా కేవలం తన ‘అల’ కతను పెట్టుబడిగా మార్చి బాలీవుడ్ నిర్మాతలతో త్రివిక్రమ్ అరవింద్ లు కలిసి చేస్తున్న వ్యాపారం హాట్ న్యూస్ గా మారింది..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: