సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఆయన పేరు చిరంజీవిగా మారిందని తెలుసు. కానీ.. ఆయన సొంత పేరును వదిలేసి.. చిరంజీవి అనే పేరునే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు. ఈపేరును పెట్టుకోవాలని చిరంజీవికి ఎవరు సూచించారు. శివశంకర వరప్రసాద్ అనే పేరు బాగానే ఉంది కదా. అసలు.. ఈ పేరు వెనుక ఉన్న స్టోరీ ఏంటి? 

 

చిరంజీవి మొదటి సినిమా పునాది రాళ్లు. కానీ.. మొదటగా విడుదలైన సినిమా ప్రాణం ఖరీదు. ఆయన సినిమాల్లో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో చిరంజీవికి ఓ ఆలోచన వచ్చిందట. తన పేరు చాలా పెద్దదిగా ఉందని.. స్క్రీన్ నేమ్ ను మార్చుకుంటే బాగుంటుందని అనుకున్నారట. ఆసమయంలో చాలా పేర్లను పరిశీలించారట. శివ, శంకర్, వరప్రసాద్ లాంటి ఎన్నో పేర్లను పరిశీలించినప్పటికీ… అవన్నీ కామన్ గా ఉండే పేర్లని ఏదైనా కొత్తగా ఉండే పేరు పెట్టుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో… చిరంజీవికి ఓ రోజు రాత్రి కల వచ్చిందట.

 

ఆ కలలో ఆయన ఆంజనేయస్వామి వారి గుడికి వెళ్లి అక్కడ మూర్చపోయారట. వెంటనే ఒక అమ్మాయి వచ్చి ఆయన్ను లేపి… చిరంజీవి ఏంటి ఇక్కడ పడుకున్నావు అని అన్నదట. వెంటనే ఆయన తేరుకొని.. నన్ను చిరంజీవి అంటుందేంటి అని అనుకున్నారట. ఆ తర్వాత బయటి నుంచి తన ఫ్రెండ్ ఎవరో ఆయన్ను పిలిచారట.చిరంజీవి..రా వెళ్దాం అన్నారట. నా పేరు చిరంజీవి కాదే.. నన్ను ఆ పేరుతో ఎందుకు పిలుస్తున్నారు.. అని వాళ్లను అడుగుతుండగానే… మెలుకువ వచ్చిందట. లేచి చూస్తే అది కల అని తెలిసిందట. వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్లి తనకు వచ్చిన కల గురించి వివరించారట.

 

ఆ భగవంతుడే నీకు మంచి పేరు సూచించాడు. చిరంజీవి అనే పేరు బాగుంది. నువ్వు ఎలాగూ ఆంజనేయుడి భక్తుడివి. చిరంజీవి అని పేరు మార్చుకో అని తన తల్లి చెప్పిందట. దీంతో అప్పటి నుంచి తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు చిరంజీవి. అలా.. ఆ పేరు ప్రస్తుతం ప్రపంచమంతా తెలిసిపోయింది. మెగాస్టార్ అయ్యేలా చేసింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: