తెలుగు సినిమా చరిత్రలో కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ సినిమాను కమర్షియల్ బాట పట్టించిన సుప్రీం హీరో చిరంజీవి. విలన్ నుండి హీరోగా స్వయంకృషితో ఎదిగిన ఆయన.. మెగాస్టార్ గా స్క్రీన్ నేం తెచ్చుకోడానికి అహర్నిశలు కష్టపడ్డారు. హీరోగా వచ్చే ప్రతి ఒక్కరికి స్పూర్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడం మనం చూస్తూనే ఉంటాం.

 

అప్పటివరకు ఎన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజుల హవా నడిచింది. అయితే చిరు ఎంట్రీ ఇవ్వడం అప్పుడే తెలుగు సినిమాకు వెస్ట్రెన్ కల్చర్ అలవాటు పడటం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి అన్ని జానర్ లలో సినిమాలు చేశారని చెప్పొచ్చు. ఒక కంప్లీట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిన తర్వాత కూడా చిరంజీవి ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ వచ్చారు. మెగాస్టార్ ఈ పేరు వెండితెర మీద పడితే రికార్డుల మోత మోగాల్సిందే అనేంతగా సినిమా అభిమాని ప్రతి ఒక్కడు మెగాస్టార్ అభిమాని అని చెప్పుకునేలా చేశాడు చిరంజీవి.

 

డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్, యాక్షన్ ఇలా అన్ని విభాగాల్లో ఫ్యాన్స్ ను అలరిస్తూ వచ్చిన చిరంజీవి ఇప్పటివరకు 151 సినిమాల్లో నటించారు. టాలీవుడ్ నాలుగు మూలస్థంబాల్లో చిరంజీవి మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. తన అనుభవాన్ని ఇప్పటి నూతన దర్శకులకు, నటులను చెబుతూ వారిని ఎంకరేజ్ చేస్తూ సిని పెద్దగా కూడా చిరంజీవి మంచి చెడులను చూస్తున్నారు. ప్రస్తుతం చిరు కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో కూడా చిరు తన ఫ్యాన్స్ ను అలరించే మాస్ స్టెప్పులు, యాక్షన్ సీన్స్ తో అలరిస్తాడని తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేస్తారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: