చిరంజీవి టాలివుడ్ లో ఒక బ్రాండ్. చిరంజీవి సినిమాలు నిజం గా ఎంతో చక్కగా గమ్మత్తు గా ఉంటాయి. బాస్ ఏ సినిమా తీసినా అది ఎంతో అద్భుతం గా ఉంటుంది. దానికి కారణం అంటూ ఏమీ లేదు. బాస్ స్టైలే అంత. ఎంత ఏమైనా ఎంత చెప్పుకున్నా ఎంతైనా తక్కువే.
 
 
ఆయన స్టైల్ కి ఆ పిచ్చి ఎక్కించే డాన్స్ కి సాటి లేరు. సరి లేరు మెగా స్టార్ కి. ఒంటరి గా ఇండస్ట్రీ లో కి అడుగు పెట్టి స్వయం కృషి తో అందరివాడు అయ్యాడు. పునాది రాళ్ళు అంటూ కెరీర్ ని మొదలు పెట్టినా జిందాబాద్ లు పొందాడు చిరు . చిరంజీవి స్టైల్ కి నిజం గా ఎంత చెప్పినా తక్కువే. ఆ కాలం హీరోయిన్స్ నుండి నేటి కాలం నటుల వరకు చిరంజీవి నటించాడు.
 
 
ఎవరైనా ఆయన నటన కి హ్యాట్స్ ఆఫ్ చెప్ప వలసిందే. తప్పక ఆయన ని మెచ్చుకో వలసిందే. అయితే ఏమిటి చిరంజీవి ఇక్కడే ఉన్నాడు కదా. కేవలం తెలుగు ప్రేక్షకుల కే తెలుసు అని అనుకోవడం నిజం గా పొరపాటే. చిరంజీవి కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు. మరెన్నో చోట్ల నటించాడు. ఎనలేని పేరు ప్రతిష్టలని సంపాదించాడు. అభిమానులే ఆయనకి అండ దండలు.
 
 
తమిళం, కన్నడం, హిందీ లో కూడా చిరంజీవి సుపరిచితుడు. ఎన్నో చిరంజీవి సినిమాలు అనువాదం చెయ్యడం జరిగింది. గ్యాంగ్ లీడర్ హిందీ లో నిర్మాణం జరిగింది. ఘరానా మొగుడు సినిమా హేయ్ హీరో గా మలయాళం లో అనువాదం జరిగింది. దొంగ చిత్రం లో గోలిమార్ పాట కి చిరు మైకేల్ జాక్సెన్ తో డాన్స్ చేసాడు. అది కూడా ఎంతో ప్రసిద్ధి గాంచింది. అంకుశం సినిమా కూడా అనువాదం జరిగింది. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: