రఫ్ ఆడించేస్తా, బాక్సు బద్దలౌద్ది, అంతొద్దు, ఇది చాలు, చిరంజీవి సినిమాల్లో మనం వినేవి. ఇలాగే ప్రతీ సినిమాలో కూడా ఏదోక సంభాషణ చిరంజీవి సినిమాలు చూసిన ప్రతీ ఒక్కరికి గుర్తుండేవి. ఈ డైలాగులు, ఈ మాటలు మాస్ ప్రేక్షకుల ఇళ్ళకు చిరంజీవిని తీసుకువెళ్ళాయి. ఇక ఆయన ఫైట్స్, ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్, హీరోయిన్ పక్కన ఆయన నటన, విలన్ తో ఆయన సంభాషణలు ఇలా ఎన్నో చిరంజీవిని మాస్ ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్ళాయి.

 

తన సినిమాలతో చిరంజీవి మాస్ ని చాలా బాగా ఆకట్టుకున్నారు. చిరంజీవి డాన్సుల కే కాకుండా ఫైట్స్ కు కూడా పెట్టింది పేరు.ఆయన ఫైట్స్ శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది.డూప్ లేకుండానే రిస్క్ తీసుకుంటారు. ఆయన నటించిన ఖైదీ, చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రా లలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 90వ దశకంలో వచ్చిన దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు ఆయన లెవెల్ ని పెంచాయి.

 

ఇప్పటికి ఎంత మంది హీరోలు వచ్చినా సరే చిరంజీవి స్థాయిలో మాస్ ని ఆకట్టుకున్న హీరో లేరు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ముందుగా వెళ్ళేది మాస్ ప్రేక్షకులే. కార్మికులు, డ్రైవర్లు, స్టూడెంట్స్ ఇలా ఎవరిని చూసినా సరే చిరంజీవి సినిమాలకే ఎక్కువగా అభిమానులు ఉంటారు. అందుకే ఆయన తన సినిమాల్లో ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూస్తూ ఉంటారు. తన పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా మాస్ ని టార్గెట్ చేసారు ఆయన. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా నిలిచారు. ఇప్పటికి మాస్ చిరూ సినిమాల కోసం చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: