ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  అయితే కొంత మంది ఇప్పటి వరకు కలిసి మెలిసి సంసార సుఖం అనుభవిస్తుంటే.. మరికొంత మంది మద్యలోనే విడిపోయారు.  బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఇక కొంత మంది హీరో, హీరోయిన్లు డేటింగ్ లో ఉన్నారు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాని రూమర్లు రావడం సహజం.  అయితే.. నిప్పులేనిదే పొగ రాదన్నట్లుగా అందులో ఎంతోకొంత నిజం ఉండే అవకాశం లేకపోలేదు. అందుకే ఆ పుకార్లలో కొన్ని పుకార్లుగానే మిగిలిపోగా.. కొన్ని మాత్రం పెళ్లిల్లుగా మారి నిజమవుతాయి. ఆ పుకార్ల గురించి తెలిసినా సరే వాటిని ఆ నటులు వినోదంగా భావిస్తారు. 

 

ఆ మద్య అనుష్క శర్మ, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా ఇలా కొంత మంది నటీమణులు తమకు నచ్చిన హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  అయితే గత కొంత కాలంగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ప్రేమ విషయంలపై రక రకాల వార్తలు వస్తున్నాయి.  మహేష్ భట్ కూతురు ఆలియాభట్ ఇప్పుడు వరుస విజయాలతో మంచి ఫామ్ లో కొనసాగుతుంది.  ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.  ఆ మద్య ఈ అమ్మడి షెడ్యూల్ కూడా పూర్తి అయినట్లు వార్తలు వచ్చాయి. 

 

తాజాగా తమ పెళ్లి తేదీపై వస్తున్న పుకార్లపై బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ స్పందించింది.  వాళ్లిద్దరూ కలిసి ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా విడుదలైన వెంటనే వీళ్లు వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వినిపించాయి. గత కొంత కాలంగా మా పెళ్లి వార్తలు.. డేట్స్ కూడా కొంత మంది ఫిక్స్ చేస్తున్నారు.. దీనివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇలాంటి పుకార్లను నేను ఫన్నీగా తీసుకుంటా అంటూ క్లారిటీ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: