తమిళంలో ఘన విజయం సాధించిన ’96’ మూవీ తెలుగు రీమేక్ ‘జాను’ ఘోర పరాజయం చెందడంతో ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమిళ్ లో హిట్ సాధించి తెలుగులో రీమేక్ అవుతున్న నాలుగు సినిమాల పరిస్థితి అయోమయంగా మారిపోయింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నాలుగు సినిమాలలో మొదటి స్థానంలో కొనసాగుతున్నది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్.


మూవీ ఇప్పటికే హిందీ తమిళ భాషలలో విడుదలై విజయం సాధించిన తరువాత కొద్ది గ్యాప్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీగా ఇప్పుడు రీమేక్ కాబడుతోంది. ‘జాను’ ఫలితంతో ఎలర్ట్ అయిన దిల్ రాజ్ ఇప్పుడు ‘పింక్’ రీమేక్ కు సంబంధించి స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేర్పులు చేయిస్తున్నాడు. 


‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయం తరువాత రామ్ అనేక ఆలోచనలు చేసి నటిస్తున్న ‘రెడ్’ మూవీ కూడ తమిళంలో హిట్ అయిన ‘తడమ్’ మూవీకి రీమేక్. ఇప్పడు ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో కూడ మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా వెంకటేష్ ‘నారప్ప’ గా నటిస్తున్న ‘అసురన్’ రీమేక్ కు సంబంధించి కూడ అనేక మార్పులు చేర్పులు జరుగుతూ 30 శాతం వరకు ఈ మూవీ కథను మార్చినట్లు టాక్. 


ఇక ఈ లిస్టులో మరొక సినిమా సత్యదేవ్ ‘ఉమ మహేశ్వర ఉగ్ర రూపస్య’ మళయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీని కూడ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ నాలుగు సినిమాల పై భారీ అంచనాలు ఉండటంతో ఈ నాలుగు సినిమాల రీమేక్ కు చాల భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ‘జాను’ ఫలితంతో పూర్తిగా తమిళ సినిమాలను యథాతదంగా తెలుగులో తీసి రిలీజ్ చేస్తే జనం చూడరు అన్న అభిప్రాయం ఏర్పడి ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన దర్శక నిర్మాతలు టెన్షన్ పడుతున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: