తెలుగు సినీ ప్రపంచంలో చిరంజీవి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇష్టంతో, కష్టంతో ఎవరైనా హీరోలు కావొచ్చు. కానీ.. ఇండస్ట్రీకి అనామకుడిగా వచ్చి తొలి సినిమా చేసిన నాటి నుంచి కేవలం పదేళ్లలోనే మెగాస్టార్ గా.. నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ ని శాసించే స్థితికి చేరుకోవటం అనితరసాధ్యమనే చెప్పాలి. ఓ వ్యక్తి కృషి, పట్టుదల, కష్టం.. అంతకు మించిన అదృష్టం. ఇవన్నీ చిరంజీవిలో పుష్కలంగా ఉన్నాయి. 1992లో వచ్చిన ఘరానామొగుడు సినిమా అప్పటి వరకూ ఉన్న టాలీవుడ్ రికార్డులను తుడిచిపెట్టేసింది.

 

 

ఈ సినిమాతో ఆయన క్రేజ్ గురించి బాలీవుడ్ వర్గాలే ఆశ్చర్యపోయాయి. ఏకంగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మైనే ప్యార్ కియా కంటే ఘరానామొగుడే ఒక్క తెలుగు వెర్షన్ లోనే అంతకుమించి వసూలు చేసిందని బాలీవుడ్ పత్రికలు కూడా కీర్తించాయి. అదే ఏడాది చిరంజీవి తన గ్యాంగ్ లీడర్ సినిమాను హిందీలో చేసిన ఆజ్ కా గూండారాజ్ గా చేశారు చిరంజీవి. ఆ సినిమాలో చిరంజీవి డ్యాన్సులు, మాస్ యాక్టింగ్ కు  బాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోయింది. రెమ్యునరేషన్ కూడా 1కోటి 25లక్షలు తీసుకుని ఇండియాలో నెంబర్ వన్ గా నిలిచారు. అమితాబ్, రజీనీకాంత్ కూడా అప్పటికి అంత పారితోషికం తీసుకోలేదు.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHIRANJEEVI' target='_blank' title='chiranjeevi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>chiranjeevi</a> bigger than bachchan

 

దీంతో ‘ది వీక్’ అనే బాలీవుడ్ పత్రిక ‘బిగ్గర్ దేన్ బచ్చన్’ అని చిరంజీవి ముఖచిత్రంగా వేసింది. అప్పట్లో ఆ పత్రిక కథనం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో చిరంజీవి క్రేజ్ దేశం మొత్తం మోగిపోయింది. తర్వాత చిరంజీవి ది జెంటిమ్ మేన్ మాత్రమే చేశారు. మళ్లీ బాలీవుడ్ వైపు దృష్టి సారించ లేదు. పాతికేళ్ల తర్వాత సైరాతో మాత్రమే ఆయన బాలీవుడ్ గుమ్మం తొక్కారు. చాలామంది బాలీవుడ్ హీరోలకు ఆయన ఇన్ స్పిరేషన్ గా కూడా మారారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: