మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకుంటే, ఆయన సినిమాల విజయాల గురించి ప్రస్తావిస్తే కచ్చితంగా ఖైదీ సినిమా పేరుని ప్రస్తావిస్తారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. ఆయన సినిమాలను ఒకానొక దశలో ఖైదీ ముందు ఖైదీ తర్వాతగా చెప్పే వారు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సూర్యం పాత్రలో మెగాస్టార్ నటన, విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది అంటే ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రతీ సీన్ లో చిరంజీవి జీవించారు. 

 

అడవిలో సన్నివేశాలు, చిరంజీవి ఆహార్యం అన్నీ కూడా హైలెట్ గా నిలిచాయి. పోలీసుల వద్ద ఆయన నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను తీయడానికి ఆసక్తి చూపించారు. అపూర్వ విజయం సాధించడంతో ఈ సినిమా హక్కుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేసారు ఇతర భాషల హీరోలు. కన్నడంలో విష్ణువర్ధన్ హీరో గానూ, హిందీలో జీతెంద్ర హీరో గానూ నిర్మించబడింది. హిందీలో ఈ చిత్రాన్ని పద్మాలయా సంస్థ నిర్మించింది. మూడు భాషల్లోనూ కథానాయికగా మాధవి నటించడం విశేషం.

 

ఈ సినిమాలో రగులుతుంది మొగలిపొద అనే పాటలో చిరంజీవి జీవించారు. ఆ పాటకి అప్పుడు టాలీవుడ్ ఫిదా అయిపోయింది. ముఖ్యంగా ఆ పాటలో చిరంజీవి హావభావాలు అన్నీ కూడా హైలెట్ గా నిలిచాయి. ఆ సినిమా తర్వాత ఎందరో దర్శకులు చిరంజీవి తో చేయడానికి ఆసక్తి చూపించారు. అక్కడి నుంచి సినిమాల్లో చిరంజీవికి తిరుగులేకుండా పోయింది అనే చెప్పవచ్చు. మాధవి, చిరంజీవి మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. అప్పటికి మాధవి స్టార్ హీరోయిన్. అయినా సరే చిరంజీవి ఆమె వద్ద ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నటించి మెప్పించారు. సినిమా మొత్తం చిరంజీవి మీదే నడిచింది. ఇలా చిరంజీవి కెరీర్ లో ఆ సినిమా మైలురాయి అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: