నాగశౌర్య లేటెస్ట్ మూవీ ‘అశ్వథ్థామ’ కు విడుదలైన రోజున పాజిటివ్ టాక్ వచ్చినా ఈ మూవీని నిర్మించిన నాగశౌర్య కు పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మూవీతో నాగశౌర్య ఫ్లాప్ ల పరంపరకు బ్రేక్ పడినా ఈ మూవీ ఆశించిన రేంజ్ లో హిట్ రాకపోవడంతో నాగశౌర్య ఇక రానున్న రోజులలో బయట సినిమాలు చేస్తూ తన కెరియర్ కొనసాగించాలి కాని సొంత నిర్మాణంలో సినిమాలు తీసే ఆలోచనకు ప్రస్తుతానికి స్వస్థి పలికినట్లు టాక్.


ప్రస్తుతం ఈ యంగ్ హీరో సితార ఎంటర్టైన్మెంట్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై సినిమాలు చేస్తున్నాడు. దీనితో తన సొంత బ్యానర్ అయిన ‘ఇరా’ క్రియేషన్స్  సంస్థకు కొంత కాలం విరామం ప్రకటిస్తే మంచిది అన్న ఆలోచనలు అతడి సన్నిహితుల నుండి వస్తున్నట్లు టాక్.  


ఇలాంటి పరిస్థితులలో సొంత సినిమాల నిర్మాణంతో చేయి కాల్చుకోవడం ఇష్టం లేక ఈ యంగ్ హీరో తన నిర్మాణ సంస్థ ఆలోచనలకు కామ పెట్టినట్లు తెలుస్తోంది. నాగశౌర్య గతంలో తీసిన ‘నర్తనశాల’ ఫెయిల్యూర్ తో చాల ఆర్ధికంగా నష్టపోయాడు అన్న వార్తలు వచ్చాయి. ఈ షాక్ నుండి తేరుకోవడానికి ఈ యంగ్ హీరోకి చాల కాలం పట్టింది. 


వాస్తవానికి మంచి నటుడుగా పేరు నాగ శౌర్యకు ఉన్నప్పటికీ పెద్ద నిర్మాణ సంస్థలు టాప్ దర్శకులు ఈ యంగ్ హీరో పట్ల పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య విపరీతమైన పోటీ వాతావరణం కొనసాగుతున్న నేపధ్యంలో నాగశౌర్య నిలదొక్కుకోవాలి అంటే ఒక సాలిడ్ హిట్ వచ్చి తీరాలి. అలాంటి కథ కోసం అదేవిధంగా దర్శకుడు కోసం శౌర్య అన్వేషణ సాగిస్తున్నా అతడి ప్రయత్నాలకు పట్టు చిక్కడం లేదు. దీనికితోడు ఈ యంగ్ హీరోకి కొద్దిగా ఇగో ఎక్కువ అన్న ప్రచారం కూడ ఇండస్ట్రీ వర్గాలలో ఎప్పటి నుంచో కొనసాగుతోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: