ఇప్పుడు అంటే ఇంత మంది హీరోలు, సినిమా వసూళ్లు, స్టార్ ఇమేజ్ ఇవన్ని ఎక్కువై ఒక హీరో సినిమాకు ప్రేక్షకులు ఎదురు చూసే పరిస్థితి ఉండటం లేదు గాని ఒకప్పుడు అయితే మాత్రం ప్రత్యేకంగా హీరో సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసే వారు అభిమానులు. ముఖ్యంగా చిరంజీవి సినిమాలకు అప్పట్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కూలి చేసుకునే వాడు అయినా ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎవరు అయినా సరే చిరంజీవి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసి మొదటి రోజే సినిమా చూడటానికి ఆసక్తి చూపించే వారు. 

 

ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకొంది. ఎన్ని ఇబ్బందులు పడినా సరే ప్రజలు ఆయన సినిమా చూడటానికి ఆసక్తి చూపించారు. దీనితో అప్పట్లో ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేసింది. జగదేకవీరుడు అతిలోకసుందరి 1990 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం. అప్పుడు బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక శ్రీదేవి, చిరంజీవి మధ్య ఉన్న సంభాషణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 

 

ఆంజనేయస్వామి భక్తుడైన రాజు (చిరంజీవి) ఒక గైడ్. అనాథ పిల్లలని నలుగురిని తనతో ఇలా మొదలయ్యే కథలో శ్రీదేవి రావడం, ఇంద్రజ: మానవా, రాజు: నువ్వా పిలుపు మానవా?, ఈ మానవుని చెంత చేరి, అచ్చిక బుచ్చికలాడి, మచ్చిక చేసుకొని, నా అంగుళీయకము సంపాదించెద, ఇంద్రజ: ఒక్క పర్యాయము నీ వామ హస్తాన్ని నా దక్షిణ హస్తానికి అందించెదవా? అంటూ శ్రీదేవి మాట్లాడిన మాటలు, చిరంజీవి నటన, సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఆ సినిమా తర్వాత చిరంజీవి చేసే పాత్రల మీద అభిమానుల్లో ఒక ఆసక్తి పెరిగిపోయింది. చిరంజీవికి ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్ కూడా దగ్గరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: