ప్రేక్షకులు ఒక్కసారి ఓ హీరోను అభిమానించడం మొదలుపెడితే తమ సొంతవారి కిందే చూసుకుంటారు. ఏళ్లపాటు అదే అభిమానాన్ని చూపిస్తారు. టాలీవుడ్ మెగాస్టార్ గా అంతటి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నాడు చిరంజీవి. అయితే.. చిరంజీవి వేసిన బాటలో వచ్చిన ఆయన కుటుంబ హీరోలు కూడా స్టార్లుగా మారిపోవటం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఓ కుటుంబం నుంచి వచ్చిన వారందరూ హీరోలుగా సక్సెస్ ఫుల్ గా రాణించడం.. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీగా స్థిరపడిపోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇటువంటి ఘనత బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ లో మాత్రమే జరిగింది.

 

 

బాలీవుడ్ లో కూడా కపూర్ ఫ్యామిలీ నుంచి ఎందరో నటులు వచ్చారు. పృథ్వీ రాజ్ కపూర్, రణధీర్ కపూర్, రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్, రుషి కపూర్, కరిష్మా కపూర్, కరీనా కపూర్, రణబీర్ కపూర్.. ఇలా బాలీవుడ్ లో పెద్ద సామ్రాజ్యమే ఉంది. అదే తరహాలో టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ మాత్రమే ఇంతగా పాపులారిటీ సంపాదించింది. చిరంజీవి బాటలో వచ్చిన ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా ఎంతటి క్రేజ్ తెచ్చుకున్నాడో తెలిసిందే. నాగబాబు నటుడిగా రాణించాడు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ టాలీవుడ్ లో టాప్ స్టార్. అల్లు అర్జున్ కూడా స్టార్ హీరో.

 

 

వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రాణిస్తున్నారు. అల్లు శిరీష్ నిహారిక, కల్యాణ్ దేవ్.. వీరంతా చిరంజీవి వారసులే. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా మరో హీరోగా రాబోతున్నాడు. ఇంతలా ఓ ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీపై తన ముద్ర వేయడం నిజంగా చాలా అరుదైన విషయం. హీరోలుగా మాత్రమే కాదు ఏకంగా సూపర్ స్టార్లు, స్టార్లుగా ఎదగడం.. ఇది టాలీవుడ్ లో జరగడం గొప్ప విషయమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: