తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.  మొదటి చిత్రంతోనే విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు.  ఆ తర్వాత రానా నటించిన చిత్రాలు పెద్దగా విజయం కాలేదు.  అయితే ఇండస్ట్రీలో తాను కేవలం హీరో పాత్రలకు మాత్రమే ప్రాధాన్య ఇవ్వకుండా ఎలాంటి పాత్రల్లో అయినా నటించి మెప్పిస్తానని అంటున్న రానా ఆ మద్య రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి2 ’ చిత్రాల్లో భళ్లాలదేవగా ప్రతినాయకుడి పాత్రలో నటించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. గతంలో రుద్రమదేవి లాంటి జానపద చిత్రంలో నటించిన రానా ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

రానా  కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఒక భారీ పౌరాణిక చిత్రం రూపొందనుంది .. అదే 'హిరణ్యకశిప. సురేశ్ ప్రొడక్షన్స్ వారు 180 కోట్ల బడ్జెట్ తో ఈ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దర్శకుడు గుణశేఖర్ దగ్గరుండి చూసు కుంటున్నారు. ఈ వేసవిలో పూజా కార్యక్రమాలను నిర్వహించి, ఆ తరువాత రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది.  రుద్రమదేవితో పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్.. చాలా గ్యాప్ తీసుకొని ఈ హిరణ్యకశిప పై దృష్టి సారించారు.

 

ఒక్కడు, చూడాలని వుంది, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించిన గుణశేఖర్, బాలల రామాయణంతో పౌరాణికాలను రుద్రమదేవి లాంటి జానపద చిత్రాలను తీసిన అనుభవం ఆయనకు ఉంది. హిరణ్యకశిప పాత్ర రానా లాంటి మంచి పర్సనాలిటీ ఉన్నవారే సరిపోతారని గుణశేఖర్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా చూశారు.  ఇక   నేనే రాజు నేనే మంత్రి తరువాత రానా చేతిలో  ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘1942’, ‘హాథీ మేరీ సాథీ’, ‘విరాటపర్వం’ వంటి క్రేజీ ప్రాజెక్టులున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: