రాజకీయాల్లోకి రావాలి అనేది చిరంజీవి కల. ఆయనతో పాటుగా ఆయన అభిమానులు కూడా చిరంజీవిని రాజకీయ యవనికపై ముఖ్యమంత్రిగా చూడాలి అని కలలు కన్నారు. వారి కోరిక తీరుస్తూ ఆయన సినిమాలకు విరామం ప్రకటించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆయన మేకప్ వేసుకోలేదు. చిరంజీవి కి సినిమాలు చెయ్యాలని ఉన్నా ఎన్నో కారణాలతో ఆయన ఆగిపోయారు. అయితే ఆ తర్వాత అభిమానుల కోరికతో పాటుగా, కొడుకు రామ్ చరణ్ ఒత్తిడి తో చిరంజీవి పదేళ్ళ తర్వాత మేకప్ వేసుకున్నారు. 

 

ఖైదీ నెంబర్ 150 పేరుతో ఆయన తన 150 వ సినిమా చేసారు. ఆ సినిమా చూసిన అభిమానులు అన్నది ఒకటే మాట. పదేళ్ళు అయినా అన్నయ్య లో ఎనర్జీ తగ్గలేదూ అని. అవును ఆ సినిమాలో చిరంజీవి డాన్స్ లో గాని నటన లో గాని ఆయన లో ఉండే హుషారు గాని ఏ ఒక్కటి తగ్గలేదు. ఆరు పదుల వయసు దాటినా సరే చిరంజీవి లో ఉన్న కుర్రతనం చూసి అభిమానులు ఫిదా అయిపోయారు అనేది వాస్తవం. అప్పుడు ఇతర హీరో లు కూడా మనం చూసింది అప్పటి చిరంజీవి నా అంటూ షాక్ అయ్యారు. 

 

ఇక మొన్నామధ్య వచ్చిన సైరా సినిమా లో కూడా చిరంజీవి తన ఎనర్జీ తో షేక్ చేసారు. పోరాట యోధుడి గా చాలా సన్నివేశాల్లో డూప్ లేకుండానే ఆయన నటించడం విశేషం. గుర్రపు స్వారీలు చేసే సమయంలో కూడా చిరంజీవి నటన ఆకట్టుకుంది. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా చిరంజీవి అదే ఎనర్జీ తో ఉంటారని, ఆయనకు వయసు మాత్రమే పెరుగుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి ఇంకో పదేళ్ళ పాటు అదే ఎనర్జీ తో ఉంటారని, ఆయనలో ఉన్న నటుడుకి వయసు లేదు అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: