కొణిదెల శివశంకర వరప్రసాద్.. పునాధిరాళ్లు చిత్రం వచ్చే వరకు ఇది ఒక సామాన్యుడి పేరు.  ఈ చిత్రం తర్వాత ఆ పేరు చిరంజీవిగా మారింది. ఎలాంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయంటే.. ఆయన క్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తెలుగు తెరపై నవ్వుల పువ్వుల పూయించిన పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. 

 

ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి 149 చిత్రాలు తీసి రాజకీయాల్లోకి వెళ్లారు.  పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ తో తన 150 చిత్రాలు పూర్తి చేసుకున్నారు.  చిరంజీవి కెరీర్లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు వచ్చాయి.  అందులో ఆయన మనసుకు హత్తుకునే చిత్రాలు కొన్ని ఉన్నాయి. హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి, సుహాసిని జంటగా నటించిన ‘చంటబ్బాయ్’ చిత్రం. అప్పట్లో ఈ చిత్రం రికార్డులను సృష్టించింది.  పాండురంగారావు ఉరఫ్ "పాండు .. జేమ్స్ పాండ్" కాస్త అయోమయం టైపు ప్రైవేటు డిటెక్టివ్. హీరోయిన్ ఒక హత్యానేరంలో ఇరుక్కుంటే ఆ కేసు పరిష్కరించే బాధ్యత అతనిమీద పడుతుంది. తన పనిలో పనిగా ఆమెను ఇంప్రెస్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంటాడు. 

 

ఈ చిత్రంలో చిరంజీవి అనాథగా పెరుగుతాడు.. దానికి కారణం తన తండ్రి అని తెలిసి ఆయనపై విరక్తి పెంచుకుంటాడు. విచిత్రంగా ‘చంటబ్బాయ్’   కేసు తాను డీల్ చేయాల్సి వచ్చి తన చెల్లెలు కి అసలు నిజం చెప్పలేక బాధపడతాడు. అయితే చంటబ్బాయ్ తన తండ్రి ఇంటికి వచ్చిన వాళ్లను ఎలా వెళ్లగొడతాడు.. చివరికి తండ్రిని ఎలా కలుసుకుంటాడు అన్నదే చిత్రకథ.  ఈ చిత్రంలో చిరంజీవి నటనకు ఎంతగానో ప్రశంసలు దక్కాయి.  కామెడీ, ఎమోషన్ తో తన విశ్వరూపాన్ని చూపించాడు. తన కెరీర్ లో ‘చంటబ్బాయ్’ చిత్రం చాలా ప్రత్యేకం అని పలు ఇంటర్వ్యూలో చెప్పారు చిరంజీవి.   చలన చిత్ర చరిత్రలో చంటబ్బాయ్ ఎప్పటికీ మరువలేని చిత్రంగా మిగిలిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: