టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చెయ్యడం అనేది చాలా మంది హీరోయిన్లకు ఇప్పటికి ఒక కలే. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే చిరంజీవి తో సినిమా చేస్తే ఆ రేంజ్ వేరు. ఎలాంటి పాత్రలో అయినా సరే చిరంజీవి సినిమాలో కనపడితే దశ తిరిగినట్టే అనేది చాలా మంది హీరోయిన్ల భావన. అందుకే ఎంత స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయినా సరే చిరంజీవి తో సినిమా అనగానే వేరే సినిమా పక్కన పెట్టి అయినా సరే ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. 

 

అయితే చిరంజీవి కూడా అదే స్థాయిలో హీరోయిన్ కి వేల్యూ ఇస్తారు. ప్రతీ సినిమాలో కూడా చిరంజీవి తన హీరోయిన్లో ఉన్న నటిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విజయశాంతి, రోజా, రాధిక, రాధ, సుమలత, మాధవి, జయసుధ, రంభ, మీనా, శ్రీదేవి, సిమ్రాన్, సిమ్రాన్, సోనాలీ బింద్రే, ఆర్తీ అగర్వాల్, సాక్షి శివానంద్, రమ్య కృష్ణ, రవళి, నగ్మ, వాణీ విశ్వనాథ్, శ్రేయ, టబు ఇలా చాలా మంది హీరోయిన్లు ఆయన పక్కన అలా సెట్ అయిపోయారు. దాదాపు అన్ని సినిమాల్లో చిరంజీవి తన తో సమానంగా హీరోయిన్ ని హైలెట్ చేస్తూ ఉంటారు. 

 

హీరోయిన్లకు కూడా ఆయనను చూస్తే ఒక హుషారు వస్తూ ఉంటుంది. అందుకే చిరంజీవి పక్కన చేయడానికి చాలా మంది హీరోయిన్లు అప్పట్లో పోటీ పడే వాళ్ళు. దర్శకులు కూడా హీరోయిన్లకు మంచి పాత్రలు ఇస్తూ ఉండే వారు. ఇతర భాషల హీరోయిన్లు సైతం చిరంజీవి తో ప్లాన్ చేసుకునే వాళ్ళు. అందరి వాడు సినిమాలో ఆయన టబుతో చేసిన కామెడి ఇప్పటికీ హైలెట్. అలా హీరోయిన్లతో పవర్ ఫుల్ డైలాగులు చెప్పడమే కాకుండా వారి పాత్రతో కూడా కామెడి చేయిస్తూ ఉండే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: