సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ప్రెజర్ కుక్కర్. ప్రతి ఇంట్ల ఇదే లొల్లి' అనేది ట్యాగ్ లైన్‌. కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి ('జార్జిరెడ్డి' ఫేమ్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకులు. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. ఫిబ్రవరి 21న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో విశ్వక్ సేన్ బిగ్ సీడీని లాంచ్ చేశారు.

 

ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ, `ప్రధానంగా ఇది సందేశం మేళవించిన ఎంటర్టైనర్. సినిమాపై ప్యాషన్ ఇద్దరు దర్శకుల్లో అణువణువూ కనిపించింది. అమెరికాకు వెళ్లినవాళ్లు నిజంగా సుఖపడటం లేదు, చాలా కష్టపడుతున్నారు. నా పిల్లలు ప్రయోజకులై అమెరికాకు వెళ్లిపోయారు అని పక్కవాళ్లను ద్వేషించే పాత్రను దర్శకులు నాకిచ్చారు. కలలు కన్న దేశానికి వెళ్లాక, కన్నదేశం కల్లోకి వస్తుందని ఒక కవి అద్భుతమైన లైన్ రాశాడు. ప్రెజర్ కుక్కర్ అనే టైటిల్ నాకే కిక్కునిచ్చింది. కొన్నిసార్లు సినిమాని టైటిల్ ఎలివేట్ చేస్తుంది. ఇలాంటి వండర్ఫుల్ టైటిల్ పెట్టినందుకు డైరెక్టర్లను అభినందిస్తున్నా. నువ్వు అమెరికాకు వెళ్లకపోతే ఎందుకూ పనికిరావని తోమేస్తున్న తల్లిదండ్రులకు ఇదొక మంచి కనువిప్పు` అని చెప్పారు.

 

డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ, `దాదాపు మూడు నెలల క్రితం ఈ సినిమా చూశాను. నాకు సినిమా నచ్చింది కానీ అక్కడక్కడా చిన్న అసంతృప్తి అనిపించింది. డైరెక్టర్‌లకు ఆ విషయమే చెప్పాను. నేను గమ్యం తీశాక ఏడు నెలలు ఆగాను. నా కోసం, నాకో కెరీర్ రావాలని ఆ సినిమా తీశాను. ఇంకొక్కసారి చూసుకొని రిలీజ్ చెయ్యమన్నాను. ఎవరైనా ఇలాంటి సలహా ఇస్తే, ఏడ్చావులే అంటారు. చిన్న చిన్న కరెక్షన్స్ చేసి మళ్లీ వారం తర్వాత చూపించారు. బాగుందన్నాను. నెల తర్వాత మళ్లీ చూడమని చెప్పారు. చాలా బాగుందన్నాను. మూడు నాలుగు వారాల క్రితం మొత్తం సినిమా చూశాను. సుజోయ్, సుశీల్ ఒక అద్భుతమైన సినిమా తీశారు. నేను ఈ సినిమాని ఒకటికి నాలుగు సార్లు చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి` అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: