తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నాటి నుంచి చిరంజీవి ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో మంది హీరోలను సైతం వెనక్కి నెట్టి చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తన నటనతో డాన్సులతో కామెడీ ఇలా ప్రతి విషయంలో అందరి హీరోల కంటే భిన్నంగా ప్రేక్షకులను అలరించారు మెగాస్టార్ చిరంజీవి. ఇక రికార్డులు సృష్టించడం చిరంజీవితోనే మొదలైంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో గా మార్చిన సినిమా ఖైదీ. ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని మెగాస్టార్ కు ఎంతగానో స్టార్ డమ్  తెచ్చిపెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటే.. ఖైదీ కి ముందు ఖైదీకి తర్వాత అని మాట్లాడేంతగా  తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభావితం చేసింది ఖైదీ సినిమా. 

 


 అయితే చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాకముందు అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పునాదిరాళ్ళు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు చిరంజీవి. చిరంజీవి హీరోగా పరిచయమైన పునాది రాళ్లు సినిమా లో మొత్తం ఐదు మంది హీరోలు ఉండగా కమెడియన్ సుధాకర్ హీరోగా చేయను అని తప్పుకోవడంతో చిరంజీవికి అవకాశం వచ్చింది ఇక ఆ తర్వాత చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల సుప్రీం  హీరో గా మెగాస్టార్ గా మారిపోయాడు చిరంజీవి. 

 


 అయితే శివశంకర వరప్రసాద్ గా  ఉన్న పేరు సినిమాల్లోకి వచ్చాక చిరంజీవిగా ఎలా మారిపోయింది అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అయితే శివశంకర వరప్రసాద్ పునాదిరాళ్లు సినిమాలో అవకాశం వచ్చిన తర్వాత... అప్పటికి తన పేరుతో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది ఉండటంతో సరికొత్త పేరు కోసం ఆలోచించారు. ఈ క్రమంలోనే ఓ రోజు  చిరంజీవికి కల వచ్చింది. ఆ కలలో  చిరంజీవి రామాలయం దగ్గర పడుకొని ఉండగా ఓ బాలిక వచ్చి చిరంజీవి నీ టైం  వచ్చింది ఇక వెళ్ళు అని చెప్పిందట.. అంతే కాకుండా తన ఫ్రెండ్స్ కూడా కలలో  చిరంజీవి అని పిలిచారట.. ఇక ఈ విషయాన్ని చిరంజీవి తన తల్లి గారికి చెబితే .. నువ్వు ఆంజనేయ భక్తుడికి కాబట్టి చిరంజీవి అనే ఆంజనేయ స్వామి పేరు తో కూడిన పేరు  స్క్రీన్ నేమ్ గా పెట్టుకోవాలి అని సూచించడంతో... శివశంకర వరప్రసాద్ పేరు కాస్త చిరంజీవి పేరుగా మారిపోయింది. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: