తెలుగు చిత్ర పరిశ్రమలు ట్రెండ్ ను సెట్ చేయాలన్న ఆ ట్రెండ్ ను  తిరగరాయాలి అన్నా అది ఒక మెగాస్టార్ కే సాధ్యం అని చెప్పాలి. తనదైన నటనతో ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. తెలుగు చిత్ర పరిశ్రమకు నిలువుటద్దంల మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా... ఎవరి ప్రోత్సాహం లేకుండా... పట్టుదలతో సొంత టాలెంట్ తో నే పైకి వచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోలు ఎంతోమంది. ఇక మెగాస్టార్ ప్రతి విషయంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి. 

 


  అయితే మెగాస్టార్ కెరియర్ మొదట్లో నటనలో మెళుకువలు నేర్చుకుంటున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆ ఇబ్బందులు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.  చిరంజీవి చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యే ముందు తన అనుభవాలని అభిమానులతో ఎన్నోసార్లు పంచుకున్నారు చిరంజీవి. చిరంజీవి చిత్ర పరిశ్రమకు రాకముందు ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనపై శిక్షణ పొందుతున్నారు. శివశంకర వరప్రసాద్ గా ఉన్న చిరంజీవి తో పాటు సుధాకర్ హరి ప్రసాద్ ముగ్గురు కలిసి టీ నగర్ లోని నెంబర్ లెవెన్ విజయ రాఘవ చారి వీధిలో  ఓ మేడమీద గదిలో అద్దెకు ఉండే వారు. 

 


ఇక చిరంజీవి తండ్రి ఊరి నుంచి నెలనెలా పంపే 100 రూపాయలతో సర్దుకుపోవడం  అలవాటు చేసుకున్నాడు  చిరంజీవి. ఇక ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందుతూనే అవకాశాల కోసం ప్రయత్నించే వారు ఈ ముగ్గురు. ఇక దొరికేవి చిన్న చిన్న వేషాలు అయినా గుర్తింపు లభిస్తుందని అవకాశాలను వదులుకోనే  వారు కాదు. వాళ్ళు ఉన్న గదిలో ఒక డొక్కు సీలింగ్ ఫ్యాన్ ఉండేది. అది అంత పాతది గాలి వచ్చేది కాదు కానీ సౌండ్ బాగా వచ్చేది. ఈ క్రమంలోనే ఈ ముగ్గురూ ఉన్న గదికి  ఓ నిర్మాత వచ్చి కలిశాడు. తన సినిమాలో ఓ వేషం ఉందని రెండు నిమిషాల పాత్ర అయినా ఎంతో ముఖ్యమైనది అంటూ చెప్పి చిరంజీవి ని ఒప్పించాడు. ఈ క్రమంలోనే ఆ సీలింగ్ ఫ్యాన్ ని చూసిన నిర్మాత ఈ సినిమాకు పారితోషికంగా  కొత్త సీలింగ్ ఫ్యాన్ ఇస్తాను అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే చిరంజీవి సినిమా చేశాడు కానీ నిర్మాత మాత్రం కొత్త సీలింగ్ ఫ్యాన్ కొన్ని ఇవ్వలేదు. చిరంజీవి రెండు నిమిషాల పాటు కనిపించే ఆ చిత్రం తాయారమ్మ బంగారయ్య నిర్మాత ఏడిద నాగేశ్వరరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: