నబా నటేష్, రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ సినిమా లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఆమె నటన తో పాటు హుషారు కి టాలివుడ్ లో ఫాన్స్ ఎక్కువైపోయారు. దానికి తోడు పాప లుక్స్ కాస్త హాట్ గా ఉండటం, కొంచెం కుర్ర కారుని ఆమె వైపు ప్రత్యేకంగా చూసే విధంగా చేస్తున్నాయి. సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు పాప యాక్టివ్ గానే ఉంటుంది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది ఈ అమ్మాయి. కొంత మంది హీరోల పక్కన ఈమె అయితేనే బాగుంటుంది అంటూ కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలో తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి పాత్రలు చెయ్యాలని భావిస్తున్నారు అనే ప్రశ్న కు గానూ... ఒక నటిగా విభిన్న పాత్రలు చెయ్యడం అనేది ఎవరికి అయినా ఇష్టమే. అయితే అనుకుంటే వచ్చేయవు అని చెప్పిది. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల లో మాత్రం తనకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు వచ్చాయని చెప్పింది. ఏ జానర్ అయినా ఇష్టమే అని చెప్పింది. 

 

ఇక పారితోషకం డబుల్ చేసారు కదా అనే ప్రశ్న కు గాను కాస్త ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నాకు ఎంత ఇవ్వాలో నా దర్శకనిర్మాతలకు బాగా తెలుసని చెప్పింది. నేను ఇప్పుడే ఈ రంగంలో నిలబడుతున్నా అని, ఇంకా డిమాండ్ చేయలేను అని చెప్పింది. తనకు ఎంత ఇచ్చినా సరే తీసుకుంటా అని చెప్పింది. ఒకరిని నేను ఇబ్బంది పెట్టలేను అని చెప్పేసింది. మరీ తక్కువ ఇస్తా అంటే ఒప్పుకోలేను అని చెప్పేసింది. ఇక రవితేజా తో కిక్ సినిమా చూసి ఫ్యాన్ అయిపోయా అని చెప్పింది. తనతో సినిమా చేయడం చాలా హ్యాపీ గా ఉందని, రవి తేజా ఎనర్జీ తో ఉంటారని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: