తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ కనిపిస్తే చాలు.. ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ సుమ కనకాల ది కేరళా నేటివిటీ అయినా.. ఆమె పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే.. అందుకే ఆమెకు తెలుగు పై మంచి పట్టుంది.  ప్రస్తుతం స్టార్ హీరోల ఏ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా సుమనే యాంకరింగ్ చేస్తుంది.  దానికి కారణం ఆమెకు ఇండస్ట్రీపై అంత పట్టుంది.. ఎవరి గురించైనా అనర్గలంగా మాట్లాడగల సత్తా ఆమెకు ఉంది.  ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి పెద్ద ఫంక్షన్లయినా సుమ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  ఇక బుల్లితెరపై ఆమె ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.

 

  ప్రస్తుతం ఆమె ఓ సొంత యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. యాంకర్ భర్త రాజీవ్ కనకాల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇక బుల్లితెరపై మెయిల్ యాంకర్ గా సత్తా చాటుతున్న ప్రదీప్ మాచినేని మొదటి సారిగా హీరోగా  '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం  చంద్రబోస్ రాసిన ఈ సాహిత్యాన్ని సమకూర్చిన 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా' అనే పాటకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ పాటకు యాంకర్‌ సుమ ఇచ్చిన హావభావాలకు నెటిజన్లు పడీ పడీ నవ్వుకుంటున్నారు. 

 

అమ్మో యాంకర్ సుమలో ఇంత మంచి నటన దాగి ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. నెలవంకను ఇద్దామనుకున్నా ఓ ఓ ఓ ఓ.. నీ నవ్వుకు సరిపోదంటున్నా ఆ అ ఆ అ ఆ.. నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే' అంటూ గాయని సునీత పాడుతుండగా సుమ ఈ హావభావాలు ఇచ్చింది. తాను పాడుతున్న పాటకు సుమ హావభావాలు ప్రదర్శిస్తున్న సమయంలో సునీత ఈ వీడియో తీసింది.  తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: