తెలుగు సినిమాల్లో చిరంజీవి వేసిన ముద్ర తక్కువది కాదు. ఎందరో హీరోలకు, దర్శకులకు, ఔత్సాహికులకు ఆయన ఓ ఇన్సిపిరేషన్ గా నిలిచారు. ఔత్సాహికులకు సినిమాల్లో రాణించాలనే ఆసక్తి రావడానికి చిరంజీవే కారణమయ్యారని ఎందరో తమ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా చిరంజీవి అంటే అభిమానం చూపించే నటులున్నారు. హిందీలో చేసిన ప్రతిబంధ్, ఆజ్ కా గూండారాజ్, ది జెంటిల్ మేన్ సినిమాలతో హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ఆజ్ కా గూండారాజ్ సినిమాలో చిరంజీవి చేసిన డ్యాన్స్ అప్పట్లో ఓ సంచలనం.

 

 

అమితాబ్ బచ్చన్ కూడా చిరంజీవి అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది. సైరా సినిమాలో కీలకపాత్ర కోసం చిరంజీవి చేసిన ఒక్క ఫోన్ కాల్ కే ఓకే చెప్పేశారట. చిరంజీవిపై ఉన్న నమ్మకంతో, అభిమానంతో రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా నటించారు. వారిద్దరి ఫ్రెండ్షిప్ బాండింగ్ కు ఇది ఉదాహరణ. సల్మాన్ ఖాన్ తో కూ చిరంజీవికి మంచి సంబంధాలున్నాయి. అమీర్ ఖాన్ అయితే టోక్యో ఎయిర్ పోర్ట్ లో చిరంజీవి కనపడగానే ‘పరుగున వెళ్లి అభిమాన హీరోను కలుసుకున్నాను’ అని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశాడు. హృతిక్ రోషన్ అయితే చిరంజీవి డ్యాన్సులకు ఫిదా అంటూ ఉంటాడు. సంజయ్ దత్ కూడా మున్నాభాయ్ ఎంబీబీఎస్ కు చిరంజీవి కరెక్ట్ ఆప్షన్ అన్నాడు.

 

 

బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కు చిరంజీవి డ్యాన్సులంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయలేకపోవడం తన కెరీర్లో వెలితిగా మిగిలిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంది. సీనియర్ దర్శకుడు మహేశ్ భట్ కూడా చిరంజీవి డ్యాన్సులు, యాక్టింగ్ అందరికీ ఆదర్శమని అంటారు. చిరంజీవితో ఆయన దిజెంటిల్ మెన్ సినిమా తెరకెక్కించారు. ఇలా ఎంతోమంది చిరంజీవిలోని స్కిల్స్ కు ఫిదా అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: