తెలుగు ఇండస్ట్రీలో అష్టాచమ్మ చిత్రంతో హీరోగా పరిచయం అయిన నాని ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో తర్వాత వరుస హిట్స్ తో దూసుకు పోతున్నాడు.  ఆ మద్య ఒకటీ రెండు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. గత ఏడాది జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు.   ఓ వైపు హీరోగా నటిస్తూనే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు నాని.  తాజాగా నాని నిర్మాతగా క్రేజీ హీరో విశ్వక్ తో  ' హిట్' చిత్రం తెరకెక్కిస్తున్నాడు.  ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ఆ మద్య రిలీజ్ చేసి మంచి స్పందన సంపాదించారు.  తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. 

 

ఆ మద్య ఫలక్ నుమా దాస్ మూవీతో హడావుడి చేసిన యువ హీరో విశ్వక్ సేన్ అనుకున్నంతగా సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. ఇక ఇప్పుడు నాని ప్రొడక్షన్ లో హిట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఒక్క అమ్మాయి మిస్సింగ్ కేసులో కథానాయకుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది సినిమాలో మెయిన్ పాయింట. ఈ ట్రైలర్ చూస్తుంటే.. సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతుంది.  ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల మిస్సింగ్, అత్యారాచాలు, హత్యలు బాగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  అయితే ఆ కేసులను పోలీసులు కూడా త్వరిత గతిన ఛేదిస్తున్నారు. 

 

తాజాగా హిట్ ట్రైలర్ లో అమ్మాయి మిస్సింగ్ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్న విషయం కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇక నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో మొదట అ! అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అప్పట్లో మంచిటాక్ తెచ్చుకుంది.  కథలో విశ్వక్ డిఫరెంట్ షేడ్స్ తో కనిపిస్తున్నాడు.  ఇక ఈ చిత్రంలో రుహని శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ట్రైలర్  అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి. ఈ చిత్రం 28న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నాని, విశ్వక్ సేన్'హిట్ 'కొడతారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: