కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. వయసు కి తగిన విధంగా సినిమాలు చేస్తూ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటున్నాడు ఈ సీనియర్ తమిళ్ హీరో. తనకు ఉన్న స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి ఎలాంటి పాత్రను అయినా చేయడానికి సిద్దమవుతున్నాడు. భారీ సినిమా లు చేస్తూ ఇతర హీరోలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఎలాంటి పాత్ర అయినా సరే దర్శకుడు కోరితే చేయడానికి వెనుకాడటం లేదు. సాధారణంగా వయసు మీద పడుతున్న సీనియర్ హీరోలు జాగ్రత్తగా ఉంటారు. 

 

కాని అజిత్ మాత్రం యాక్షన్ సన్నివేశాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ స్టార్ హీరో కి అక్కడ ఫాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం అజిత్ హీరోగా ఖాకీ సినిమా దర్శకుడు హెచ్ వినోద్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ‘వ‌లిమై’. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఒకరు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ లో అజిత్ గాయపడినట్టు సమాచారం. సోమవారం ఈ సినిమా లో కొన్ని యాక్షన్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలోనే ఒక బైక్ చేజింగ్ సీన్ ని షూట్ చేస్తున్నాడు దర్శకుడు. ఇలా బైక్ చేజింగ్ చేస్తున్న సమయంలో బైక్ స్కిడ్ అయిపోయింది. అయితే కాస్త రెస్ట్ తీసుకుని అజిత్ వెంటనే ఆ సీన్ కంప్లీట్ చేసి, హాస్పిటల్ కి వెళ్ళాడట. గాయాలు చిన్నవే అని కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలని చెప్పారట వైద్యులు. దీనితో అజిత్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ సినిమా త్వరలోనే హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పిన్ రీమేక్ సినిమాలో కూడా అతను నటిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో అజిత్ ఎక్కువగా డూప్ లేకుండానే చేస్తాడని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: