తెలుగు ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చిన హీరో ఎవరూ అంటే వెంటనే చెబుతారు మెగాస్టార్ చిరంజీవి.  పునాధిరాళ్లు చిత్రంతో ఆయన వెండితెరపై అడుగు పెట్టి మొన్నటి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం వరకు ఎన్నో అనుభవాలు.. కష్టాలు.. కన్నీళ్లు చూశారు.  ఒక నటుడు ఈ స్థాయికి చేరుకోవాలంటే ఒకటీ రెండు చిత్రాలతో అయ్యే పనికాదు.  మెగాస్టార్ కెరీర్ లో విలన్ గా కూడా నటించిన విషయం తెలిసిందే.  ఎలాంటి పాత్రలకైనా తాను సిద్దం అయి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పుడు మెగాస్టార్ గా నిలిచారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నటుడు గానే కాదు మంచి వ్యక్తిత్వం.. ఉదార స్వభావం గల మనిషి అంటారు.  ఆయన ఈ స్థాయికి ఎన్ని కష్టాలు పడి వచ్చారో తెలుసు. 

 

గతంలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తనకు గంజీ తెలుసు.. బెంజీ తెలుస అన్నారు.  తనను ఈ స్థాయిలో నిలబెట్టింది.. నిర్మాతలని వారు చల్లగా ఉంటే సినీ ఇండస్ట్రీ బాగుంటుందన్న నమ్మేవారిలో తాను మొదటి వ్యక్తి అని అన్నారు.  అందుకే ఆయనతో చిత్రాలు తీసే ఏ నిర్మాత అయినా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు.   తనలో నటనను వెలికితీసిన దర్శకులందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటానని అంటుంటారు.  తెలుగు  ఇండస్ట్రీలో కుటుంబ నేపథ్యంలో సాగే కథాకథనాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యకి మంచి పేరు వుంది. అలాంటి ముత్యాల సుబ్బయ్య .. చిరంజీవి కథానాయకుడిగా 'హిట్లర్'.. 'అన్నయ్య' వంటి చిత్రాలను తెరకెక్కించారు.

 

అప్పట్లో ఈ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. సెంటిమెంట్, ఎమోషన్స్ తో  కూడిన చిత్రాలను నేను బాగా తీయగలననే నమ్మకంతోనే చిరంజీవిగారు 'హిట్లర్' ,  'అన్నయ్య'  చిత్రాలు చేసే అవకాశం ఇచ్చారు.  ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టాను. చిరంజీవిగారు గొప్ప ఆర్టిస్ట్ ..ఆయన ఏ పాత్రనైనా అవలీలగా చేయగలరు.  అంతే కాదు తన తోటి ఆర్టిస్టులను,   టెక్నీషియన్స్ ను బాగా గౌరవిస్తారు. తొందరపడి ఎప్పుడూ ఎవరి మనసును నొప్పించరు. ఎక్కడ కనిపించినా ఆత్మీయంగా పలకరిస్తారు. అందుకే ఆయన అంటే అందరికీ గౌరవం అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: