తమిళ హీరో అజిత్ కుమార్ చేసిన సినిమాలన్నీ ప్రస్తుతం బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం అజిత్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను అందుకున్నారు తమిళ హీరో అజిత్ కుమార్. ఇక ప్రస్తుతం అజిత్ కుమార్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాలిమై  చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా తమిళ హీరో అజిత్ షూటింగ్ లో గాయపడ్డాడు. 

 

 బైక్ చేజింగ్   చిత్రీకరించే సమయంలో... హీరో అజిత్ బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో అజిత్ చేతులు కాళ్ళకు గాయాలయ్యాయి. అయినప్పటికీ అజిత్ అవేమీ పట్టించుకోకుండా.. కాసేపు విరామం తీసుకున్నాడు. అనంతరం మళ్లీ షూటింగ్ లో పాల్గొనీ..  బైక్ చేసి సన్నివేశాన్ని పూర్తిచేశాడు అజిత్. ఇక షూటింగ్ ముగిసిన అనంతరం ఆసుపత్రిలో కి వెళ్లి చికిత్స తీసుకోన్నాడు... కాగా కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల అజిత్ కు ని వైద్యులు సూచించారు. అయితే తమ అభిమాన హీరో అజిత్ కు  గాయాలయ్యాయని తెలియగానే అభిమానులు అందరూ కంగారు పడిపోయారు.

 

 

 అయితే ఎలాంటి డూప్ ని ఉపయోగించకుండా రియల్ స్టంట్స్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే డూప్ లేకుండా బైక్ చేజింగ్  చేయడం ద్వారా బైక్ అదుపు తప్పి పడిపోయాడు అజిత్. అయితే ఈ ప్రమాదం నుంచి అజిత్ స్వల్ప గాయాలతో బయటపడడంతో అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అజిత్  త్వరగా కోలుకోవాలని అంటూ సోషల్ మీడియాలో ప్రార్థిస్తున్నారు  అభిమానులు. దీంతో ప్రస్తుతం #getWellSoonTHALA అనే హ్యస్టాగ్  సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. మీరు ఆరోగ్యంగా ఉండటమే మాకు కావాల్సిందే... మిగతావన్నీ తర్వాతే... గాయాల నుంచి కోలుకున్న తర్వాత మరింత ఎక్కువ ఎనేర్జి తో  తిరిగి రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు  అంటూ అజిత్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: