150 సినిమాల మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఒక సినిమా మాత్రం ఎప్పటికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటివరకు ఫ్యామిలీ సినిమాలు తీసుకుంటూ ఒక సగటు హీరోగా ఉన్న చిరంజీవిని మెగాస్టార్ గా చేసిన సినిమా ఖైది. కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా చిరుని మాస్ ఆడియెన్స్ కు బాగా దగ్గర చేసింది. సినిమాలో చిరు డ్యాన్స్, ఫైట్లు ఇవన్ని అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ లో ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఫైట్ ఇప్పటికి క్రేజీగా ఉంటుంది. 

 

ఈ సినిమాను అసలైతే సూపర్ స్టార్ కృష్ణతో ప్లాన్ చేశాడు కోదండ రామిరెడ్డి. ఆయన వేరే సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ చేయడం కుదరలేదు. అయితే అప్పటికి ఫామ్ లో ఉన్న చిరంజీవికి ఖైది ఛాన్స్ వచ్చింది. ఈ ఒక్క సినిమా చిరు ఫేట్ మార్చేసిందని చెప్పొచ్చు. చిరు కెరియర్ గురించి చెప్పుకుంటే ఖైది తర్వాతే అసలు చిరు స్టామినా ప్రూవ్ అయ్యింది. సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అవడమే కాకుండా చిరంజీవి ఇమేజ్ ను సైతం డబుల్ చేసిన సినిమా ఇదని చెప్పొచ్చు. 

 

అప్పుడే కాదు దశాబ్ద కాలం బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కూడా ఖైది నంబర్ 150 సినిమాతో వచ్చాడు. పర్ఫెక్ట్ రీ ఎంట్రీగా వచ్చిన ఖైది నంబర్ 150 సినిమా మళ్ళీ చిరుకి సూపర్ హిట్ ఇచ్చింది. ఖైది టైటిల్ తో చిరు మరో రెండు మూడు సినిమాలు చేసినా వర్క్ అవుట్ అయ్యేలా ఉన్నాయి. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.. ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: