టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గాను, యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో నిజాం ఉక్కు పోరాటం పై ఫైట్ చేసిన గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తాడని... ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.రాధాకృష్ణ నిర్మిస్తార‌ని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.



అయితే ఇదే సినిమాని తాను సైతం నిర్మించాలని ఎన్టీఆర్ సోదరుడు క‌ళ్యాణ్‌రామ్‌ భావిస్తున్నట్టు కూడా మరో ప్రచారం జరిగింది. అయితే ఇంత‌లోనే ఎన్టీఆర్ గురించి మ‌రో అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. త్రివిక్రమ్ అల తర్వాత ఖాళీ అవడం, ఎన్టీఆర్ ఏమో ఆర్.ఆర్.ఆర్ సినిమాతో జనవరి 8 వరకు బిజీగా ఉండడంతో.. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం అంత టైం వెయిట్ చెయ్యలేక మరో యంగ్ యంగ్ హీరోతో క‌మిట్ అయ్యే ప్లాన్‌లో ఉన్నాడ‌ట‌.



ఇదే టైంలో ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ అందుబాటులో లేక‌పోతే తమిళ దర్శకుడు అసురన్ ఫేమ్ వెట్రిమారన్ తో టచ్ లో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్. వెట్రిమార‌న్ ఎన్టీఆర్ కోసం అదిరిపోయే మాస్ మ‌సాలా స్టోరీ రెడీ చేసిన‌ట్టు టాక్‌. ఇప్పటికే వెట్రిమారన్ ఎన్టీఆర్ ని కలిసి మాస్ మసాలా కథని వినిపించినట్లుగా వార్తలొస్తున్నాయి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ నుంచి చాలా మంది క్లాస్ సినిమాలు కోరుకుంటున్నారు. ఈ టైంలో ఇంత ఊర‌మాస్ సినిమా అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారా ? అన్న డౌట్లు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: