టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్టులో ఇప్పటివరకు కొనసాగిన హీరో నితిన్ పెళ్ళి చేసుకోబోతున్న న్యూస్ ఇప్పటకే అందరికి తెలిసిన విషయం. అయితే ఈ పెళ్లి వెనుక మెగా కాంపౌండ్ మూలాలు ఉన్నాయి అన్నవార్తలు ఇప్పడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చాయి. రాబోతున్న ఏప్రిల్ నెలలో  షాలినితో  నితిన్  పెళ్లి దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరుగబోతుంది. 


దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ప్రేమించుకున్న ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్దం అవ్వడం వెనుక అనేక  ట్విస్ట్ లు ఉన్నాయి. ప్రస్తుతం నితిన్ ను పెళ్లి చేసుకోబోతున్న షాలిని తల్లిదండ్రులది ప్రేమ వివాహం. షాలిని తండ్రిది ప్రకాశం జిల్లా. అయితే చాల సంవత్సరాల క్రితం షాలిని తల్లితండ్రులు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యే ముందు షాలిని తల్లితండ్రులు కొంతకాలం నాగర్ కర్నూలులో ప్రగతి నర్సింగ్ హోమ్ ను ప్రారంభించి  అక్కడ చాలామందికి ఉచిత వైద్యం చేసి చాలమంచి పేరు సంపాదించారు. 


షాలిని తల్లిదండ్రులు నూర్జహాన్ సంపత్ లు వీరిద్దరు కూడా డాక్టర్లు. 
అయితే ఇప్పడి నితిన్ అత్తవారి కుటుంబానికి చిరంజీవి కుటుంబంతో  సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టినప్పుడు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే స్థానంను నూర్జహాన్ కు ఇవ్వడమే కాకుండా ఆమె గెలుపు కోసం చిరంజీవి అప్పట్లో ప్రచారం చేయడం కూడ జరిగింది. 


అయితే నితిన్ అత్తగారు  నూర్జాహాన్ అప్పటి ఎన్నికలలో ఓడిపోవడంతో ఆమె ఆతరువాత రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఇప్పడు ఈవిషయాలు అన్ని మీడియాకు లీక్ కావడంతో నితిన్ అత్తవారి కుటుంబం గురించి అనేక మీడియా సంస్థలు వార్తలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు దుబాయ్ లో జరగబోయే నితిన్ పెళ్ళికి కేవలం అతడి సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తారని అయితే పెళ్ళి తరువాత హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ ను అత్యంత ఘనంగా నితిన్ కుటుంబ  సభ్యులు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: