ఎనభయ్యవ దశకంలో ఇండస్ట్రీకొచ్చి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి చిరంజీవి. ఫిలిం ఇనిస్టిట్యూట్ విద్యార్ధిగా సినిమాల్లోకి వచ్చి అనంతర కాలంలో తన కష్టం, కృషితో మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. సినిమాల్లో రాణించాలంటే తనదైన టాలెంట్ ఒకటుండాలని గ్రహించిన చిరంజీవి తన డ్యాన్సులు, ఫైట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపి నెంబర్ హీరోగా టాలీవుడ్ ని దశాబ్దాలుగా ఏలేస్తున్నాడు. చిరంజీవి టాలెంట్ గురించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కూడా చెప్తూంటారు.

 

 

వారిలో తమిళ చిత్ర పరిశ్రమలోని దర్శక దిగ్గజం కె.బాలచందర్ ఓ మాట అనేవారు. ‘రజినీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి’ అని సభాముఖంగా అప్పట్లో ప్రస్తావించారు. రజినీ, కమల్ ను సినిమాల్లోకి తీసుకొచ్చి స్టార్ స్టేటస్ కల్పించింది బాలచందరే. చిరంజీవి కంటే రజినీ, కమల్ కొద్దిగా సీనియర్లు. దాంతో కమల్ లోని డ్యాన్సింగ్ అండ్ యాక్టింగ్ టాలెంట్, రజినీలోని స్టైల్, మాస్ అన్ని కలగలిపి చిరంజీవిలోనే ఉన్నాయని ప్రశంసించారు. ఇదే విషయాన్ని అత్తకుయముడు అమ్మాయికి మొగుడు సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న సమయంలో రజినీకాంత్ కూడా ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం.

Image may contain: 3 people

 

 

చిరంజీవితో కె.బాలచందర్ నాలుగు సినిమాలు తెరకెక్కించారు. చిరంజీవి తొలినాళ్లలో 47రోజులు, ఇది కథ కాదు, ఆడవాళ్లూ మీకు జోహార్లు తెరకెక్కించారు. చిరంజీవి స్టార్ అయ్యాక సామాజిక సృహ ఉన్న కథాంశంతో రుద్రవీణ తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి నటన అద్భుతమనే చెప్పాలి. సినిమాలో పాటలు ఇప్పటికీ వినిపిస్తూంటాయి. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. అంజనా ప్రొడక్షన్స్ పై నిర్మించిన తొలి సినిమా కూడా ఇదే. తర్వాత నటనకు అవకాశం ఉన్న పాత్రలెన్నింటినో చిరంజీవి చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: