హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ వుడ్‌ను తీసుకున్నా ఇక్కడ ప్రేమలు, డేటింగ్‌లు కామన్.. నచ్చితే ఆ రిలేషన్ కొంతకాలం సాగుతుంది నచ్చకపోతే మధ్యలోనే విడిపోతుంది.. ఇక సినిమా రంగంలో ఇద్దరు వ్యక్తులు డేటింగ్ చేయాలంటే వయస్సుతో అసలు సంబంధం లేదు. ఖర్చును భరించే అంతటి డబ్బు ఉంటే చాలు.. ఇదిగో ఇప్పుడు ఓ నటుడు విషయంలో ఇదే జరిగింది.. అతనితో రెండేళ్లు డేటింగ్ చేసాక అతను ముసలోడు అందుకే వదిలేసానంటోంది ఓ నటి..  

 

 

ఇంతకు ఆ హీరో పేరు ఏంటంటే అల్ పాచినో(79).. ఇజ్రాయెల్‌కి చెందిన ఈ నటుడికి, ఆ దేశానికే చెందిన మీటల్ డోహాన్(40) అనే నటికి లింకు కుదిరింది. వీరిద్దరు ఒకరికొకరు నచ్చి రెండేళ్ల పాటు డేటింగ్ చేసారు. ఏ అవార్డ్ ఫంక్షన్‌కి వెళ్లినా కలిసే వెళ్లేవారు. మొన్న జరిగిన ఆస్కార్స్ వేడుకలో మీటల్ డోహాన్ ఒంటరిగా రావడంతో, అప్పుడే ఇద్దరూ విడిపోయి ఉంటారని టాక్ వచ్చింది. ఇప్పుడు మీటల్ మీడియా ముందు వచ్చి తామిద్దరం విడిపోయిన మాట నిజమేనని చెప్పింది. అంతా బాగానే ఉంది గాని ఎందుకు విడిపోయారంటే ఆవిడ చెప్పిన కారణం మాత్రం సిల్లీగా అనిపిస్తుంది.

 

 

అదేమంటే నాకు అతనికి మధ్య చాలా ఏళ్ల గ్యాప్ ఉంది. అదీగాక ముసలోడితో ఎక్కువకాలం ప్రేమలో ఉండటం నాకు సాధ్యం కాని పని. ఇక వయసు గురించి నేను పెద్ద పట్టించుకోలేదు కానీ అతను ముసలోడు అనేది మాత్రం నిజమే. అందుకే నాకు వర్కవుట్ అవ్వడం లేదు. మేమిద్దరం రెండేళ్ల పాటు డేటింగ్‌ చేసాం. కానీ ఈ రెండేళ్లలో కేవలం పువ్వులు మాత్రమే నాకు కొనిచ్చాడని చెప్పుకొచ్చింది.

 

 

ఇక ఈ విషయాన్ని గమనించిన నెటిజన్స్ పాచినోతో డేటింగ్‌లో ఉన్నప్పుడు అతని వయసు కనిపించలేదా అని తిట్టి పోస్తున్నారు. అసలు విషయం అదికాదని మీటల్ డోహాన్ కు అతను కోరినంత డబ్బు ఇవ్వడంలేదని వదిలేసిందని, బయటికి మాత్రం ముసలోడు కాబట్టి వదిలేసానని చెబుతోందని పాచినో ఫ్యాన్స్ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: