బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాజమౌళి ఏ మాట మాట్లాడినా, ఏ సినిమా చేసినా సరే దానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. జాతీయ స్థాయిలో రాజమౌళి పేరు ఒక్కసారిగా మారు మొగిపోయింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే భారీ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఎడాది సంక్రాంతి కి వస్తుంది ఈ సినిమా. ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్న జక్కన్న షూటింగ్ అయ్యే వరకు కూడా ఇంటికి వెళ్ళను అనే రేంజ్ లో ఉన్నాడు. ఇక ఈ సినిమాతో తన రికార్డులను తానే తిరగరాసే యోచనలో ఉన్నాడు. 

 

ఇక ఈ సినిమా విషయంలో నిర్మాత కూడా ఖర్చు రాజీ పడకపోవడంతో జక్కన్న చాలా వరకు హైలెవెల్ లోనే తీస్తున్నాడు. సినిమా తీస్తే పది కాలాల పాటు గుర్తుండిపొవాలి అనే రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలీవుడ్ నటీనటులు కూడా పని చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా విషయంలో రాజమౌళి కొత్త విధానాన్ని అనుసరించే ఆలోచనలో ఉన్నాడట. 

 

ఈ సారి  ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారానికి వినూత్నంగా ఆలోచిస్తున్నాడు.ఈ సినిమా కోసం ప్రమోషనల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు అభిమానులు కేవలం బాలీవుడ్ లోనే ఇలాంటి ప్రచారం చూసారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రావడం, బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కావడం తో ఎక్కడా వెనక్కు తగ్గే ఆలోచన చేయడం లేదు జక్కన్న. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ రాయమని సిరివెన్నెల కు కూడా చెప్పినట్టు సమాచారం. ఏది ఎలా ఉన్నా ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: