ఫ్లాపులొచ్చాయని ప్రయాణం ఆపేస్తే కెరీర్ ఉండదు. సక్సెస్ ను టార్గెట్ చేస్తూ జర్నీ చేస్తూనే ఉండాలి. అప్పుడే గ్రాఫ్ మారుతుంది. రవితేజ కూడా ఇలానే గ్రాఫ్ మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేసేందుకు  ప్రయత్నిస్తున్నాడు. 

 

రవితేజ ఇప్పుడు చాలా డల్ ఫేజ్ లో ఉన్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత సరైన హిట్ లేక మార్కెట్ లోనూ వెనకబడ్డాడు. పైగా ఈ హీరో హవా తగ్గిపోయిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ రవితేజ మాత్రం ఈ మాటలు అస్సలు పట్టించుకోవడం లేదు. ఫ్లాపులని పక్కనపెట్టేసి సక్సెస్ కోసం పరుగులు తీస్తూనే ఉన్నాడు. 

 

రవితేజ బర్త్ డే సందర్భంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల స్టెప్పులేస్తానంటూ వచ్చాడు డిస్కోరాజా. కొంచెం సైన్స్ మరికొంచెం మాఫియా కలిసున్న ఈ రాజా, రవితేజ ఫ్లాపులకు బ్రేకులెయ్యలేకపోయాడు. పైగా అప్పటికే నేల టిక్కెట్టు, టచ్ చేసి చూడు తెచ్చి పెట్టి ఫ్లాపుల బాధను మరింత పెంచాడు. 

 

వరుస ఫ్లాపుల నుంచి బయటపడేందుకు రవితేజ స్పీడు పెంచుతున్నాడు. వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ పోలీస్ గా మారాడు రవితేజ. ఆ తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మే 8న క్రాక్ రిలీజ్ అవ్వగానే రమేశ్ సినిమా స్టార్ట్ చేసి 2020లోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. సో ఈ ఏడాది రవితేజ మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. మరి ఈ స్పీడ్ లో అయినా రవితేజ ట్రాక్ మారుతుందేమో చూడాలి. మొత్తానికి రవితేజ స్పీడ్ పెంచేస్తున్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలతో వస్తున్నాడంటే మాటలు కాదు. ఆయన ఫ్యాన్స్ మాస్ మహా రాజా మూవీస్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆయన డైలాగ్ డెలివరీతో ఎంజాయ్ చేసేందుకు సిద్ధమైపోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: