కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలుసిందే. ఆ సినిమా కాకముందే క్రిష్ డైరెక్షన్ లో సినిమా ముహూర్తం పెట్టేశారు. ఈసారి పవన్ తన సినిమాల వేగం పెంచాడని చెప్పొచ్చు. వేణు శ్రీరామ్, క్రిష్ సినిమాల తర్వాత హరీష్ శంకర్ తో కూడా మూవీ చేస్తాడని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా పవన్ ఒక సీక్వల్ కు ఓకే చెప్పాడని ఫిల్మ్ నగర్ టాక్. 

 

కిశోర్ కుమార్ అలియాస్ డాలి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి గోపాల గోపాల సినిమా చేశాడు. బాలీవుడ్ సినిమా ఓ మై గాడ్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. రీమేక్ స్పెషలిస్ట్ గా డాలి ఈ మూవీని పర్వాలేదు అన్నట్టుగా  తీశాడు. ఆ తర్వాత పవన్ డాలీకి కాటమరాయుడు మూవీ ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఆ సినిమా మాత్రం పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. ఇక ఫైనల్ గా డాలికి పవన్ మరో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 

 

గోపాల గోపాల సీక్వల్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.  ఈ సీక్వల్ కథని ఇప్పటికే రెడీ చేసినట్టు సమాచారం. అయితే సో గోపాల గోపాల సీక్వల్ అంటే పవన్ మరోసారి కృష్ణుడి పాత్రలో అలరిస్తాడని అంటున్నారు. మరి ఈ సీక్వల్ లో వెంకటేష్ నటిస్తాడా లేక మరెవరైనా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ మూవీ కన్ ఫామ్ అయినా ఏడాది తర్వాతే పవన్ డాలీకి డేట్స్ ఇచ్చేలా షెడ్యూల్ చేసుకున్నారు. మరి గోపాల గోపాల సీక్వల్ ఎలాంటి కథతో వస్తుందో.. ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.పవన్ వరుస సినిమాలతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి చేసుకోనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: