తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్ లు  ఉన్నప్పటికీ కొత్తగా ఎంట్రీ ఇచ్చే  హీరోయిన్లకు కూడా కొదవలేదు. ఎప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూనే ఉంటారు దర్శక నిర్మాతలు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల ఎంత మంది ఉన్నప్పటికీ ప్రేక్షకాదరణ ఉన్నది మాత్రం కొంతమందికి ఉంది. ఆ కొంత మంది పైనే దర్శకనిర్మాతలు అందరి చూపు ఉంటుంది. అలా తెలుగు హీరోయిన్స్ లో  ప్రేక్షకాదరణ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది రాసి కన్నా. అందం అభినయం కలగలిసిన ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. మొదట్లో గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన రాసి కన్నా నటన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి నటించిన తొలిప్రేమ సినిమా తో ఈ అమ్మడికి ఇమేజ్ బాగా పెరిగిపోయింది. 

 


 ఇక ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన సుప్రీమ్ లో  నటించడంతో స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే గతంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడుకి  ఆ తర్వాత.. బ్లాక్ బస్టర్ హిట్  మాత్రం పడలేదు. దీంతో స్టార్ హీరోయిన్ రేసులో ఉన్న రాశి  కన్నా వెనుకబడి పోయింది. ఇప్పుడు ఈ అమ్మాయికి కెరియర్  నత్తనడకన నడుస్తోంది. మొన్నీమధ్య వెంకీ మామ ప్రతి రోజు పండుగ సినిమాలలో నటించి విజయం సాధించినప్పటికీ ఈ రెండు సినిమాలలో రాసి పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. ఇక మొన్నటికి మొన్న విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో  హీరో అర్జున్ రెడ్డి సరసన నటించిన స్టార్ హీరోయిన్ గా మారిపోతుంది  అనుకుంటే ఆ సినిమా కూడా నిరాశ పరిచింది ఈ అమ్మడికి. 

 


 దీంతో స్టార్ హీరోయిన్ రేసులో మరింత వెనుకకు వెళ్ళి పోయింది ఈ అమ్మడు. నిజానికి ఈ సినిమాతో రాశి కెరీర్ కూడా చివరి దశకు వచ్చేసినట్లే అని కామెంట్ కూడా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రేక్షకుల్లో  ఎంతగానో ఇమేజ్  సంపాదించిన రాసీఖన్న కి ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కూడా దక్కడం లేదు. కేవలం మీడియం హీరోలతో మాత్రమే నటిస్తోంది. మీడియం హీరోలలో  కూడా ఇప్పటికే దాదాపు అందరి తో జోడీ కట్టింది. ఇక  అటు మీడియం  హీరోలు కూడా కొత్త హీరోయిన్ల పై ఆసక్తి చూపుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాసి కన్నా ఎలా ఆఫర్ సాధింస్తుందా .. లేదా కోలీవుడ్కు వెళ్లి  సెట్ అయిపోతుంద అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: