తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒకప్పుడు శివ చిత్రంతో  ఏ రేంజ్ లో ట్రెండ్ సృష్టించారో అందరికీ తెలిసిందే.  ఈ చిత్రంతో నాగార్జునకు మాస్ ఇమేజ్ పెరిగిపోయింది. చాలా కాలం తర్వాత మరోసారి నాగ్ - వర్మ కాంబినేషన్ లో ‘ఆఫీసర్’ చిత్రం వచ్చింది.  కానీ ఈ చిత్రం ఘోర పరాజయం పొందింది.  ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ డిజాస్టర్  కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  గత ఏడాది రాహూల్ రవింద్ర దర్శకత్వంలో నాగార్జున, రకూల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వచ్చిన మన్మథుడు 2 మరో భారీ డిజాస్టర్ పొందింది.  దాంతో ఆలోచనలో పడ్డారు నాగార్జున.  ఈసారి మంచి కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. 

 

ఈ నేపథ్యంలో దాంతో ఆయన కొత్తదనంతో కూడిన కాన్సెప్ట్ లపై దృష్టిపెట్టాడు. అలా ఆయన చేస్తున్న సినిమానే 'వైల్డ్ డాగ్'. అహిషోర్ సోలొమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ గా కనిపించనున్నారు. నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈచిత్రం , ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఫైట్స్, చేజింగ్స్, సీక్రెట్ ఆపరేషన్ ఇలా  భారీ  సీన్స్ ఉండనున్నాయి. అందుకే చిత్ర బృందం ప్రత్యేక శ్రద్దతో ఫైట్ సీన్స్ రూపొందిస్తున్నారు.

 

ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్లో టీమ్ కీలకమైన పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన హౌస్ సైట్లో ఈ ఫైట్ రూపొందుతోంది.  ఈ యాక్షన్ సీన్లో నాగార్జునతో పాటు సయామీ ఖేర్ కూడా పాల్గొంటోంది. ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తించేదిగా ఉంటుందని అంటున్నారు. సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా నాగ్ చేసే ఛేజింగ్స్ .. ఫైట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెబుతున్నారు. మరి ఈ చిత్రంలో అయినా నాగార్జున మంచి హిట్ అందుకుంటాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: