ఏదైనా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి స్టైల్ వేరు. ఎవరు ఎన్ని అన్నా సరే చిరంజీవికి అంటూ ఒక ప్రత్యేక ఉంటుంది. ఆయన సినిమాల కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తారో అందరికి తెలిసిందే. చిరంజీవి సినిమా చేస్తున్నారు అంటే స్టొరీ లైన్ ఏంటీ అందులో ఆయన పాత్ర ఏంటీ అంటూ అభిమానుల్లో ఒక ఆసక్తి ఉంటుంది. ఇక ఆ సినిమా దర్శకుడు మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు. సైరా సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. 

 

సినిమా ప్రస్తుతం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే వేసవిలో విడుదల అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఏ వార్త పూర్తిగా బయటకు రాకపోయినా షూటింగ్ లో పాల్గొంటున్న కొందరు నటులు మాత్రం కొన్ని విషయాలను చెప్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సాహసాలు చేస్తున్నారు. గోదావరి నదిలో ఆయన ఒక ఫైట్ కూడా చేస్తున్నారట. పడవలో ఉంటుంది అంటున్నారు ఈ ఫైట్. అయితే ఈ ఫైట్ ని ఆయన డూప్ లేకుండానే చేస్తున్నారట. ఒక విగ్రహం కోసం అయ్యే ఫైట్ ని గోదావరిలో షూట్ చేస్తున్నాడట కొరటాల శివ. 

 

ఇటీవల ఒక ఫైట్ ని అలాగే షూట్ చేసారు.  ఆ ఫైట్ లో కళ్ళ జోడు పడకుండా చిరంజీవి ఫైట్ చేసారని అంటున్నారు. ఇక ఈ సినిమా కు నిర్మాత గా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు. సినిమాలో ప్రస్తుతం కీలక భాగం షూట్ చేస్తున్నారు. చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడని టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ఏది ఎలా ఉన్నా ఈ వయసులో చిరంజీవి డూప్ లేకుండా షూట్ చేయడం ఇప్పుడు హైలెట్ గా మారింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: