సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమా లతో రెండు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి ఈ ఏడాది స్టార్టింగ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నెక్స్ట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. కాగా ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపార రంగంలో దూసుకుపోతున్న మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లో అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసినదే.

 

ఇటువంటి నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...కొత్తగా తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాలలో భాగంగా ఒకటి వైజాగ్ లో రాజధాని పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఇప్పటికే చాలామంది పారిశ్రామిక రంగానికి చెందినవారు పలు సంస్థలు పెట్టడానికి జగన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకపక్క పారిశ్రామికంగా మరోపక్క ఆహ్లాదకరమైన సిటీగా పేరొందిన వైజాగ్ లో ఇండస్ట్రీ తీసుకురావాలని జగన్ గతంలో చిరంజీవి తో మరియు కొంతమంది ఇండస్ట్రీకి చెందిన వారితో మంతనాలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.

 

కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు ఎవరు వైజాగ్ లో ఎటువంటి వ్యాపారాన్ని స్టార్ట్ చేయలేదు. ఇటువంటి తరుణంలో ముందు నుండి వైసీపీ పార్టీకి మరియు వైయస్ రాజశేఖర్ కుటుంబానికి సన్నిహితంగా ఇండస్ట్రీ లో ఉండే కుటుంబాలలో ప్రధాన కుటుంబం మహేష్ కుటుంబం. ఇలాంటి సందర్భంలో మహేష్ బాబు ఇండస్ట్రీ నుండి మొట్టమొదటిగా వైజాగ్ లో హైదరాబాదులో ఏఎంబీని స్టార్ట్ చేసినట్లు వైజాగ్ లో కూడా పెట్టడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కమర్షియల్‌ ఏరియాలో ల్యాండ్‌ కోసం చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

ఏడాదిలో అంటే వచ్చే వేసవి దసరా వరకు వైజాగ్‌ ఏఎంబీని ప్రారంభించేలా చకచక పనులు జరగాలంటూ మహేష్ తన పార్టనర్ తో ఏషియన్‌ అధినేత సునీల్‌ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ల్యాండ్ విషయంలో మహేష్ బాబు కి పూర్తిగా సహకరించడానికి జగన్ సర్కార్ ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో వైజాగ్ లో తెలుగు ఇండస్ట్రీ తరపున కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు జగన్ కి మొట్టమొదటిగా మహేష్ రెస్పాండ్ అవటం తో...జగన్ కోసం వైజాగ్ లో మహేష్ మల్టీప్లెక్స్ థియేటర్ పెట్టాలని నిర్ణయం తీసుకోవటం నిజంగా శుభ పరిణామమే అని అంటున్నారు వైసిపి పార్టీ మరియు మహేష్ అభిమానులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: