గతంలో స్టార్ హీరోయిన్ అనగానే ఒక టాక్ ఉండేది. నటన కూడా వచ్చి, డాన్స్ వచ్చి, స్టార్ హీరోలతో రెండు మూడు సినిమాలు హిట్ అయితే చాలు వాళ్ళ రేంజ్ అమాంతం పెరిగిపోవడం అనేది అందరూ చూసారు. ఇక టాలీవుడ్ లో అయితే ఒక్క సినిమా హిట్ అయి అది ఏ మహేష్ తోనో, జూనియర్ ఎన్టీఆర్ తోనో, ప్రభాస్ తోనో చేసి ఉంటే మాత్రం వాళ్ళను ఆపడం అనేది ఎవరి తరం కాదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉండటంతో దర్శక నిర్మాతలు కొత్త హీరోయిన్ల కోసం చూస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలో అదృష్టము  పరిక్షించుకుని స్టార్ హీరోయిన్ అయిపోవాలని హీరోయిన్లు చాలా ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నభా నటేష్ సహా చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు డిమాండ్ చెయ్యాలి అంటే భయపడుతున్నారు. మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు నిర్మాత ఎంత అంటే అంతకు ఓకే అంటున్నారు. నభా నటేష్ కూడా ఇదే విషయం చెప్పింది. ఇక పొతే ఇప్పుడు రష్మిక మంధనా కూడా అదే బాటలో ఉందని సమాచారం. 

 

ప్రస్తుతం పాపకు హిట్ రేటింగ్ ఎక్కువగానే ఉన్నా ఆమె డిమాండ్ చేయడానికి కాస్త జంకే పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టుకున్న ఆమె ఆ ఆఫర్లు కూడా ఓకే అయితే మాత్రం ఇక కూల్ గా రేట్స్ పెంచాలని చూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్క సమంతా నే డిమాండ్ చేస్తుంది గాని వేరే వాళ్ళు ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. ముఖ్యంగా కుర్ర హీరోయిన్లు నిధి అగర్వాల్, సహా కొందరు అవకాశం వస్తే చాలు అనుకుంటున్నారట. దీనితో దర్శక నిర్మాతలు ఇప్పుడు కాస్త ఆలోచనలో పడినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: