వరల్డ్ ఫేమస్ లవర్ దెబ్బతో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పరిస్థితేంటో అర్థమైపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది వరల్డ్ ఫేమస్ లవర్ కాదు వరస్ట్ లవర్ అన్న పేరు తెచ్చుకుంది. అసలే గత రెండు సినిమాలు దారుణంగా ఫ్లాపయి విజయ్ డిసప్పాయింట్ లో ఉంటే ఏదో మంచి టైటిల్ తో ఈ సినిమా వస్తుంది పక్కా హిట్ అనుకున్నారు. కానీ చెప్పడానికి మాటలు కూడా లేకుండా అయిపోయింది ఈ సినిమా పరిస్థితి. వరల్డ్ ఫేమస్ ఫ్లాప్ తో ప్రతీ ఒక్కరికీ దిమ్మ తిరిగిపొయింది. దర్శకుడు క్రాంతి మాధవ్, హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత ..ఇలా అందరూ కోలుకోలేకపోతున్నారట. పైకి ఏదో బిల్డప్ గా కనిపిస్తున్నపటికి లోపల మాత్రం అందరికి రక్త కన్నీరేనని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. 

 

ఇక ఇక్కడ ఇంకో టాక్ ఏమిటంటే దర్శకుడు, హీరో, నిర్మాత ..ఈ ముగ్గురిది ఫ్లాప్ రికార్డే. ఈ రికార్డ్ కూడా సినిమాకి గట్టి దెబ్బేసింది అని అంటున్నారు. అదీగాక ఈ సినిమా విడుదలకు ముందే డైరక్టర్ క్రాంతి మాధవ్ ను పక్కన పెట్టేసినట్లు కనిపించింది. ఏ ప్రచార కార్యక్రమంలో కూడా పాపం డైరక్టర్ క్రాంతి మాధవ్ కనిపించలేదు. పైగా విజయ్ కూడా డైరక్టర్ గురించి ఆచి తూచి మాట్లాడారు. అప్పుడే అందరికీ అర్థమైపోయింది. డైరక్టర్ ఎక్కడా కనిపించడం లేదు అసలేంటి మ్యాటర్ అని.

 

నిజానికి ఈ విషయం విజయ్ ఆలోచించాలి. డిజాస్టర్ అవుతున్న ప్రతి సినిమా విషయంలో విజయ్ మీద ఇవే తరహా గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అందరూ తప్పించుకుంటున్నారు. సినిమా ఫ్లాపయితే మాత్రం అందరికి ఒక్క విజయ్ దేవరకొండ తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. నోటా సినిమా, డియర్ కామ్రేడ్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమాల రిజల్ట్ తెలిశాక అందరికీ టార్గెట్ విజయ్ అయిపోతున్నాడు. దాంతో విజయ్ కి దిక్కు తోచడం లేదట. ఏంట్రా నా పరిస్థితి ఇలా తయారైంది అంటూ తల బాదుకుంటున్నాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: