ఇప్పుడు తెలుగు బుల్లి తెర మీద యాంకర్ సుమాని కొట్టేవారు లేరు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సుమాకి ఉన్న క్రేజ్ గాని ఆమెకు ఉన్న పలుకుబడి గాని ఆమెకు ఉన్న టాలెంట్ గాని ప్రస్తుతం ఎవరికి లేదు అనేది చాలా మంది భావన. దీనితోనే ఆమె ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. ఏ సినిమా ఫంక్షన్ అయినా ఏ టీవీ షో అయినా సరే సుమా లేకుండా ఉండటం లేదనేది అర్ధమవుతుంది. టాప్ హీరోల ప్రీ రిలీజ్ కార్యక్రమాలు అన్నీ దాదాపుగా సుమా చేతుల మీదుగానే జరుగుతున్నాయి. 

 

ఇప్పుడు ఇదే అనసూయని ఇబ్బంది పెడుతుంది. తనకు జబర్దస్త్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో సుమా కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. కాని యాంకర్ గా ఎక్కువ షోస్ కి అవకాశాలు మాత్రం సుమానే వరిస్తున్నాయి. సదరు కార్యక్రమాల నిర్మాతలు కూడా సుమా కోసమే ఎదురు చూస్తున్నారు. దీనితో ఇప్పుడు సుమా ని బీట్ చేయడానికి పలుకుబడి పెంచుకునే ప్రయత్నం లో ఉంది అనసూయ. 

 

ఆమెకు అవకాశాలు వస్తున్నాయో లేదో తెలియదు గాని మీడియా లో మాత్రం ఆమెపై ప్రచారాలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అనసూయ ఇప్పుడు ప్రీ రిలీజ్ కార్యక్రమాలకు అతనకు అవకాశం ఇవ్వాలని దర్శకులను కోరుతున్నట్టు సమాచారం. ఈ మధ్య ఒక నిర్మాతను, దర్శకుడిని కలిసి ఇదే విషయాన్ని చర్చించినట్టు సమాచారం. అయితే సుమా విషయంలో మాత్రం కొన్ని కొన్ని అదనపు లక్షణాలు ఉండటంతో ఆమె కే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనితో ఇప్పుడు అనసూయ సుమాని డామినేట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. మరి ఆమె ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో ఎన్ని కార్యక్రమాలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: