దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న ఈ సినిమా పై టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులకు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో రామ్ చరణ్ కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాధాకృష్ణ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

కాగా సినిమా ఈ యేడాది జూన్ నెలాఖరులో రిలీజ్ చేయాలని అనుకోగా ...షూటింగ్ ఆలస్యం అవటంతో వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయటానికి రాజమౌళి రెడీ అయ్యారు. ఇటువంటి తరుణంలో రాజమౌళిపై మెగా అభిమానుల నుండి నందమూరి అభిమానుల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో చాలా నిరుత్సాహం అసహనానికి గురైన రాజమౌళి తాజాగా వచ్చిన పుకారు లాంటి వార్తలపై ఫుల్ సీరియస్ అయ్యాడట. 'ఆ పుకారు ఎవరు పుట్టించారు ' అంటూ చెలరేగి పోయారట. మేటర్ లోకి వెళ్తే  ఆర్.ఆర్.ఆర్ మొదటి రోజు టికెట్ రేటు 1000/ రూపాయలు ఫిక్స్ చేయాలని జక్కన్న టీం అనుకుంటుందని వార్తలు వచ్చాయి.

 

గతంలో బాహుబలి మొదటిరోజు టికెట్ 2000/ నుండి 3000/ వరకు బ్లాక్ లో అమ్ముడయిన కారణంగా ఖచ్చితంగా ఆర్.ఆర్.ఆర్ కి మంచి క్రేజ్ అండ్ బజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డే 1000/ రూపాయలు ఫిక్స్ చేస్తే బావుంటుందని రాజమౌళి నిర్మాతలతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వచ్చిన వార్తలను రాజమౌళి పూర్తిగా ఖండించాడు. అసలు అంత సినిమా టికెట్ రేట్ నిర్ణయించటానికి నాకేంటి హక్కు అంటూ వచ్చిన వార్తలపై రాసిన వారిపై రాజమౌళి ఫుల్ సీరియస్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: