డేరింగ్ లేడీ అనే మాటకు పర్ ఫెక్ట్ మీనింగ్ లా మారుతోంది నయనతార. ఎవరేం అనుకుంటే నాకేంటి.. నేనింతే.. నా లైఫ్ నా ఇష్టం అన్నట్టు బిహేవ్ చేస్తోంది. తన పర్సనల్స్ గురించి పట్టించుకోవడం మానేసి.. మీ పనులు మీరు చేసుకోండని సందేశాలు ఇస్తోంది. 


సౌత్ హీరోయిన్లు అంటే కొంచెం సైలెంట్ గా, కామ్ గా ఉంటారనే మాటలు చెరిపేస్తోంది నయనతార. రిలేషన్స్ ను చాలా సీక్రెట్ గా ఉంచుతూనే సౌత్ హీరోయిన్లకు భిన్నంగా.. లవ్ స్టోరీని సోషల్ మీడియాకు ఎక్కిస్తోంది నయన్. అయిదేళ్లుగా విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయనతార, ఈ మధ్య లవ్ విషయంలో చాలా ఓపెన్ గా ఉంటోంది. 

 

వాలంటైన్స్ డే సందర్భంగా విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశాడు. నయనతారతో కలిసున్న స్టిల్స్ అప్ లోడ్ చేసి ప్రేమ కొటేషన్లు పెట్టాడు. దీనికి నెటిజన్ల నుంచి వింతవింత కామెంట్లు వస్తున్నాయి. మీ జోడీ భలేగా ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, మరికొంతమంది మాత్రం ఇంక పెళ్లి చేసుకోరా.. ఇలాగే ఉంటారా అని ప్రశ్నలేస్తున్నారు.


నయనతార మాత్రం ఇలాంటి కామెంట్స్ ను అస్సలు పట్టించుకోవడం లేదు. నా లైఫ్ నా ఇష్టం.. ప్రేమ, పెళ్లి విషయంలో మీ సలహాలు అక్కర్లేదు అన్నట్టు ప్రవర్తిస్తోంది. దీంతో విఘ్నేష్ మరికొన్ని ప్రేమ ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నాడు. దీంతో నయనతార చాలా డేరింగ్.. రిలేషన్ ను అస్సలు పట్టించుకోవడం లేదని మాట్లాడుకుంటున్నారు కోలీవుడ్ జనాలు. మొత్తానికి నయనతార లవ్ లో పీక్ స్టేజ్ లో ఉంది. పెళ్లి గురించి ఎవరడిగినా.. నా ఇష్టం.. నేను ఇలానే ఉంటా.. మీ పని మీరు చూసుకోండంటూ చిర్రుబుర్రులాడుతోంది. ఆమెతో మాట్లాడాలంటేనే కోలీవుడ్ జనాలు తెగ భయపడిపోతున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: